హోటల్లో సోంపులో కలిపే చక్కర పలుకులు తింటున్నారా..?

సాధారణంగా మనం ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు  ఫుడ్డు వగైరా తిన్న తర్వాత తప్పనిసరిగా  సోంపు గింజల్ని నోట్లో వేసుకుంటాం.వీటితో పాటుగా రకరకాల స్వీట్ ఐటమ్స్ అందులో ఉంటాయి. సోంప్ అంటే మనందరికీ తెలుసు కానీ మిగతా చక్కెర పదార్థాలు  ఏంటి అనేది ఎవరికి తెలియదు. తినడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి వాటిని ఎలా తయారు చేస్తారు అనే వివరాలు చూద్దాం.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని షుగర్, క్యాండీ  షుగర్,  రాక్ షుగర్, అలాగే గడి చక్కర అని పిలుస్తారు. ఇది ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి  ఉపయోగపడుతుంది. ఇందులో జీర్ణం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే రెస్టారెంట్లు, హోటల్లలో సోంపుతో పాటు అందులో ఈ చక్కెర స్పటికాలను కలుపుతూ ఉంటారు. మీరు కడుపునిండా తిన్నా కానీ సోంపుతో పాటు ఇవి నోట్లో పడడం వల్ల  ఈజీగా జీర్ణమవుతుంది


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-27/1719499861_sounf.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనం ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు  ఫుడ్డు వగైరా తిన్న తర్వాత తప్పనిసరిగా  సోంపు గింజల్ని నోట్లో వేసుకుంటాం.  వీటితో పాటుగా రకరకాల స్వీట్ ఐటమ్స్ అందులో ఉంటాయి. సోంప్ అంటే మనందరికీ తెలుసు కానీ మిగతా చక్కెర పదార్థాలు  ఏంటి అనేది ఎవరికి తెలియదు. తినడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి వాటిని ఎలా తయారు చేస్తారు అనే వివరాలు చూద్దాం.

సాధారణంగా మన ఒంట్లో వేడి చేసినప్పుడు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పటిక బెల్లం లేదంటే గడి చక్కెర తినమని చెబుతూ ఉంటారు. దీంట్లో ఎక్కువగా వేడి తగ్గించే లక్షణం ఉంటుంది. ఈ చక్కెరను ఎక్కువగా చెరుకు రసం నుంచి తయారు చేస్తూ ఉంటారు. చక్కెర తయారీకి ప్రాసెసింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా పటిక బెల్లం కూడా చెరుకు రసం నుంచే తయారవుతూ ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువగా ప్రాసెస్ జరగదు.  అలా ప్రాసెస్ చేయని చక్కెర పటిక బెల్లం. ఇందులోఎక్కువగా విటమిన్స్ ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని షుగర్, క్యాండీ  షుగర్,  రాక్ షుగర్, అలాగే గడి చక్కర అని పిలుస్తారు. ఇది ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి  ఉపయోగపడుతుంది. ఇందులో జీర్ణం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే రెస్టారెంట్లు, హోటల్లలో సోంపుతో పాటు అందులో ఈ చక్కెర స్పటికాలను కలుపుతూ ఉంటారు. మీరు కడుపునిండా తిన్నా కానీ సోంపుతో పాటు ఇవి నోట్లో పడడం వల్ల  ఈజీగా జీర్ణమవుతుంది. అందుకే వీటిని  ఆహారం తిన్న తర్వాత వాడుతూ ఉంటారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sounf hotel food, health-benifits

Related Articles