ప్రస్తుత కాలంలో గుడ్ న్యూస్ అయినా, బ్యాడ్ న్యూస్ అయినా సరే చాలామంది ప్రజలు డీజేలు పెట్టి, భారీ సౌండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి జరిగినా, ర్యాలీ తీసినా పార్టీలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ మనిషి చచ్చినా, పెద్దపెద్ద
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో గుడ్ న్యూస్ అయినా, బ్యాడ్ న్యూస్ అయినా సరే చాలామంది ప్రజలు డీజేలు పెట్టి, భారీ సౌండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి జరిగినా, ర్యాలీ తీసినా పార్టీలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ మనిషి చచ్చినా, పెద్దపెద్ద డీజే బాక్సులు పెట్టి సౌండ్స్ తో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. మరి అలాంటి భారీ సౌండ్స్ వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది యువకులే గుండెపోటు బారిన పడి మృతి చెందుతున్నారు. మరి డీజేల వద్ద ఇంతమంది గుండెపోటుకు గురికావడానికి కారణాలేంటి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
తాజాగా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఇందులో గుండె జబ్బులు లేని వ్యక్తులు కూడా డిజె సౌండ్స్ ల వల్ల హృదయ సంబందిత వ్యాధి బారిన పడి మృతి చెందారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట.. సంగీతం అనేది ఒక నిర్దిష్ట పరిధి దాటి వినడం వల్ల మన హృదయంపై హానికరమైన ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ శబ్దాల వల్ల గుండెలో వేగం ఒక్కసారిగా పెరిగిపోవడం, భయం, ఆందోళన, రావడం వంటివి జరుగుతాయట.
అయితే మనిషి వినే అంత పరిమితిలోనే సౌండ్ వింటే బాగుంటుందట ఈ పరిమితి దాటితే గుండెపోటు రావడం పక్కా అని నిపుణులు అంటున్నారు. ఎక్కువ వ్యాల్యూమ్ ఉండడం వల్ల చెవిలోని ఇంద్రియ కణాలు, నిర్మాణాలన్ని అలసిపోతాయట. ఇవి ఎక్కువ కాలం పాటు కొనసాగడం వల్ల వినికిడి లోపం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మానవుని యొక్క చెవి 60 డేసిబల్స్ వరకు వినడానికి మాత్రమే సాధ్యపడుతుందని అంతకంటే ఎక్కువ సౌండ్ పెట్టుకొని కొన్ని గంటలపాటు వింటే మాత్రం తప్పక గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు..
ముఖ్యంగా మంచి సంగీతం అనేది అనేక రోగాలను బాగు చేస్తుందట. ఆ సంగీతం అనేది శృతిమించిపోయి ఎక్కువ సౌండ్ తో వింటే మెదడుపై ప్రభావం పడి శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపించి గుండెపోటు కారణమవుతుందట. ఇప్పటికే ఎన్నో ఫంక్షన్లలో చూసాం. డీజే ల ముందు డాన్స్ చేస్తూ ఎంతో మంది కుప్పకూలిపోయారు. కాబట్టి తాజాగా గణేష్ నిమర్జనాల సందర్భంగా డీజేలు పెట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు.