Virat Kohli: విరాట్ కోహ్లీ కొలిచే...నీమ్ క‌రోలీ బాబా ఎవరు ?

విరాట్ కొహ్లీకి దేవుని మీద భక్తి ఎక్కువ.. శివాలయంలో పూజలు చేయిస్తుంటారు. తనకు టైం దొరికిన ప్రతి సారి ...ఓ దేవాలయానికి వెళ్లి కుటుంబ సమేతంగా పూజలు చేయించుకుటారు. ఇప్పుడు రీసెంట్ గా కొహ్లీ ఫోన్ వాల్ పేపర్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం వాల్ పేపర్ తెలుసా ...నీమ్ కరోలీ బాబా ..కొహ్లీ ఒక్కరే కాదు..ఎందరో ప్రముఖులకు ఈయన గురువు.


Published Jul 05, 2024 06:27:00 PM
postImages/2024-07-05/1720184292_InShot20221119111903766.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విరాట్ కొహ్లీకి దేవుని మీద భక్తి ఎక్కువ.. శివాలయంలో పూజలు చేయిస్తుంటారు. తనకు టైం దొరికిన ప్రతి సారి ...ఓ దేవాలయానికి వెళ్లి కుటుంబ సమేతంగా పూజలు చేయించుకుటారు. ఇప్పుడు రీసెంట్ గా కొహ్లీ ఫోన్ వాల్ పేపర్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం వాల్ పేపర్ తెలుసా ...నీమ్ కరోలీ బాబా ..కొహ్లీ ఒక్కరే కాదు..ఎందరో ప్రముఖులకు ఈయన గురువు.


కొంతమంది సాక్ష్యాత్తు దైవస్వరూపంగా భావించే ‘నీమ్‌ కరోలీ బాబా’ ఫొటో ఉండటమే. భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా.. ముంబైలో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. ముంబై మెరైన్ డ్రైవ్ పొరుగునా ..అభిమానులు తన ఘన సన్మానం చేశారు. ఇక ఈ వేడుక ముగిసిన త‌ర్వాత విరాట్ కోహ్లీ త‌న భార్య‌, పిల్ల‌ల‌ను క‌ల‌వ‌డానికి లండ‌న్ వెళ్లిపోయాడు. 


లండ‌న్ విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత త‌న డ్రైవ‌ర్‌కు గుడ్‌బై చెప్పే సమయంలోనే విరాట్‌ కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌పై నీమ్‌ కరోలీ బాబా ఫొటో ఉండటం కెమెరా కంటికి చిక్కింది. ఇక తెలుసుగా ...ఆ వాల్ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ నీమ్ కరోలీ బాబా ఎవరంటే..


బాబా నీమ్ క‌రోలీని చాలామంది హ‌నుమంతుని అవ‌తారంగా భావిస్తారు. ఆయన హనుమాన్ అనడానికి ఎన్నో కథలున్నాయి.  హిందుస్థాన్ టైమ్స్ మ‌రాఠీ నివేదిక ప్ర‌కారం బాబా ప్రధాన ఆశ్ర‌మం 1964లో కైంచి ధామ్‌లో స్థాపించ‌బ‌డింది.నీమ్ బాబాకు కొహ్లీ ఒకరే కాదు..స్టీవ్ జాబ్స్ , ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు , మార్క్ జుకర్ బర్గ్ , జూలియా రాబర్ట్స్ వంటి వారు ఎందరో ప్రముఖులు ఆయనకు పరమ భక్తులు.


ఇక యూపీలో జ‌న్మించిన ఈయ‌న అస‌లు పేరు ల‌క్ష్మ‌ణ్ నారాయ‌ణ్ శ‌ర్మ‌. చిన్న‌త‌నంలోనే సాధువుగా మారారు. త‌న ప్ర‌వ‌చ‌నాల ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌ను సొంతం చేసుకున్నారు. 1973లోనే బాబా నీమ్ క‌రోలీ మ‌ర‌ణించారు. కాగా, గ‌తేడాది హోలీ పండుగ సందర్భంగా కోహ్లీ దంప‌తులు ఆయ‌న ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. మరణించినా స్వామి వారి శక్తి ...భక్తులపై ఉంటుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక ఉన్నత విలువల వైపు నడిపిస్తారని భక్తుల నమ్మకం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style

Related Articles