ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 చాలా డిఫరెంట్ వేలో కొనసాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారం కూడా కంప్లీట్ అయ్యే దశకు చేరుకుంది. కానీ ఇంతకుముందు సీజన్ లో ఈ సీజన్ లో చాలా డిఫరెంట్కాన్సెప్ట్
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 చాలా డిఫరెంట్ వేలో కొనసాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారం కూడా కంప్లీట్ అయ్యే దశకు చేరుకుంది. కానీ ఇంతకుముందు సీజన్ లో ఈ సీజన్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ టాస్కులతో షో అద్భుతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయింది. ఇక రెండవ వారం శేఖర్ భాషా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే తరుణంలో మూడో వారం కూడా అద్భుతమైన నామినేషన్లు జరిగాయి.
ఈ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. ఇందులో నాగమణికంఠ, విష్ణు ప్రియ, పృథ్వి, సీత, ప్రేరణ, అభయ్, నైనిక, యష్మీగౌడ నామినేషన్ లిస్టులో ఉన్నారు. అయితే ఈ సోమవారమే ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో కంటెస్టెంట్లకు సరైన ఓట్లు పడతాయని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఈ వారం ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎవరు వెనుకబడి పోయారు అనే విషయానికి వస్తే .. విష్ణు ప్రియ మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో నాగ మణికంఠ ఉన్నారు.
గత వారంలో డేంజర్ లో ఉన్నటువంటి సీత ఈవారం బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి ఓటింగ్ లో థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది. ఇక ప్రేరణ పూర్తి ప్లేస్ లో, యస్మి గౌడ ఫిఫ్త్ ప్లేస్ కు వచ్చింది. అయితే యస్మి గౌడ అంతకుముందు మంచి స్థానంలో ఉండి, కొన్ని తప్పుల కారణంగా దిగజారి పోతోంది. ఆమె హౌస్ లో ప్రవర్తించే తీరు జనాలకు నచ్చకపోవడంతో ఆమె వెనుకబడిపోతుంది. ఇక ఆ తర్వాత స్థానాలలో అభయ్, నైనిక, పృధ్వి, ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అబయ్, పృద్విలు డేంజర్ లో ఉన్నట్టే.
పృద్వి మొదటి వారం నుంచే ఓటింగ్ లిస్టులో ఉంటున్నాడు. కానీ బిగ్ బాస్ తన సొంత స్క్రిప్ట్ చేస్తుండటంతో ఆయన బయటపడుతున్నాడు. ఇదే తరుణంలో నైనిక ఏదైనా టాస్క్ ఇస్తే దాన్ని పట్టుకొని ఆమె గట్టిగా నిలబడే శక్తి ఉంది. ఇక అభయ్ విషయానికి వస్తే నిఖిల్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి స్పెషల్ గుడ్డు సహకారంతో ఒకరిని నామినేషన్స్ నుంచి తప్పించవచ్చు. అయితే నిఖిల్ కోసం సెల్ఫ్ నామినేట్ అయినటువంటి అభయ్ ని తప్పకుండా నిఖిల్ రక్షిస్తాడు. ఇక డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం పృథ్వి అని చెప్పవచ్చు.