మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్మిపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 3 నెలలు కావోస్తున్నా ఇప్పటికి దోషులను ఎందుకు పట్టుకోలేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి జూపల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, దోషులను శిక్షిస్తామనాలి, కానీ మృతుడిపై కుటుంబంపై నిరదార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పోలీసులు ఈ కేసును ఛేదించాలని, ఎవరిని అడిగిన హంతకులు ఎవరో చెబుతున్నారు. అయినా పోలీసులు కేసును చేదించట్లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ విషయంపై అధికారులను ఆదేశించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. మంత్రి జూపల్లి కృష్ణ రావు అనుచరుడిపై శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీకీయంగా ఎదురు కోలేక తన ముఖ్య అనుచరుడు చిన్నంబావి మాజీ జెడ్‌పిటిసి కృష్ణ ప్రసాద్ చేత ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.