Kaushik Reddy: హరీష్ రావు కాదు సీఎం రేవంత్ రాజీనామా చేయాలి

రైతుల రుణమాఫీ విషయంలో 100% రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి తప్పా హరీష్ రావు కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.


Published Aug 15, 2024 10:12:42 AM
postImages/2024-08-15/1723734721_reddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: రైతుల రుణమాఫీ విషయంలో 100% రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి తప్పా హరీష్ రావు కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. గురువారం తెలంగాణ భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఆగస్టు 15 వరకు 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం 17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. హరీష్ రావు 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తానని చెప్పారని దానిని గమనించాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో తొమ్మిది వేల కోట్లు తగ్గించి 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారని, బడ్జెట్లో మాత్రం 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చివరికి కేవలం 17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. 31 వేల కోట్ల రుణమాఫీ 47 లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. 

రైతు రుణమాఫీ 46% మంది రైతులకు మాత్రమే చేశారని అన్నారు. మిగిలి ఉన్న 54 శాతం మంది రైతులను గాలికి వదిలేసి హరీష్ రావు పై ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ విషయంలో తప్పు చేశానని ఒప్పుకొని ముఖ్యమంత్రి అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు భూమికి రాయాలని అన్నారు. ఎక్కడి వెళ్తే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచమ్మ, పెద్దమ్మ అంటూ ఉన్న దేవుళ్ళ అందరి మీద ఒట్టు వేసి రైతులను మోసం చేశారని అన్నారు. ప్రపంచంలో బహిరంగంగా దేవుళ్ళ మీద ఒట్టు వేసి తప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్య మంత్రి అవుతాడు అని అన్నారు. రైతులను రుణమాఫీ పేరిన మోసం చేసి మరి హరీష్ రావును తిట్టడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిట్లు వస్తాయని, పదవికి గౌరవించి మాత్రమే ఊరుకుంటున్నామన్నారు. హైదరాబాదులో ఉన్న మూసిని ప్రక్షాళన చేయడం కాదని మూసి లాంటి రేవంత్ రెడ్డి నోరును ఎన్ని కోట్లయో ఖర్చయినా సరే ప్రక్షాళన చేయాలని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, దానికి బాధ్యత వహిస్తూ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావును ఓడగోడతానని ప్రగాబ్బాలు పలికిన రేవంత్ రెడ్డి ని కొడంగల్లో  చిత్తుచిత్తుగా ఓడించింది  హరీష్ రావే అనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కొడంగల్ లో 33 వేల మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే సమయానికి 22 వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిన విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన అప్పుడే ఓడిపోయినట్లు అయింది అన్నారు. తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలు తిరిగి ఎప్పుడు వచ్చినా రేవంత్ రెడ్డికి కోడంగల్ లో డిపాజిట్ మాత్రం దక్కదని జోష్యం చెప్పారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress farmers cm-revanth-reddy paadi-koushik-reddy

Related Articles