ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమిటీ కుర్రోళ్ళు. ఆగస్టు బరిలో
న్యూస్ లైన్ డెస్క్:ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమిటీ కుర్రోళ్ళు. ఆగస్టు బరిలో పెద్ద చిత్రాలకు పోటీగా వచ్చినటువంటి కమిటీ కుర్రోళ్ళు అద్భుతమైన విజయాన్ని సాధించింది. రవితేజ హీరోగా వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్, రామ్ హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్, విక్రం హీరోగా వచ్చిన తంగలాన్ మూవీలను ఈ చిన్న సినిమాలు అద్భుతమైన హిట్ సాధించాయని చెప్పవచ్చు.
అలాంటి కమిటీ కుర్రోళ్ళు చిత్రం కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. యాదు వంశీ దర్శకత్వంలో కొత్త నటీనటులతో వచ్చినటువంటి మూవీ కమిటీ కుర్రోళ్ళు. ఈ చిత్రాన్ని 1990 జ్ఞాపకాలను గుర్తు చేయడం కోసం గోదావరి పల్లె వాతావరణన్ని ఆకట్టుకునేలా చూపించారు. అలాంటి ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా నిహారిక పని చేశారు. ఇలాంటి ఈ చిన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
అలాంటి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. పాజిటివ్ టాక్ తో వచ్చిన ఈ మూవీ మంచి ధరకే ఆహా తీసుకుందని సమాచారం. ఈ సినిమా సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా నిహారిక మొదటిసారి ప్రొడ్యూస్ చేసిన చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించడంతో మెగా అభిమానులంతా సంబరపడిపోతున్నారు.