తిరుమల శ్రీవారి దర్శనానికి 31కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. దాదాపు కంపార్ట్ మెంట్లలో 1.5 లక్షల మంది వేచి ఉన్నట్లు టీటీడీ తెలిపింది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి 31కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. దాదాపు కంపార్ట్ మెంట్లలో 1.5 లక్షల మంది వేచి ఉన్నట్లు టీటీడీ తెలిపింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా ప్రాంతాల నుంచి అటు తమిళనాడు, ఇటు ఆంధ్రా , తెలంగాణ , కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తిరుమలకు భారీ గా తరలివచ్చారు.
తిరుమల( Tirumala) కు వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. ప్రసాదాల వద్ద , రూమ్స్ వద్ద, లాకర్ రూమ్స్ వద్ద భారీగా భక్తుల రద్దీ చేరినట్లు తెలిపింది. అయితే వచ్చే నెల మూడవ తేదీ నుంచి శరన్నవరాత్రులు మొదలవుతాయి. శ్రీవారి బ్రహ్మాత్సవాలు కూడా మొదలవుతాయి.
నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకోగా 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.18 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. అయితే వచ్చే నెల స్వామి బ్రహ్మాత్సవాల కారణంగా మరింత రద్దీ ఉండే అవకాశాలున్నాయని ..చిన్నపిల్లలతో మొక్కులు తీర్చుకునేవారు కాస్త ఆలోచించి దేవాలయానికి చేరుకోవాలంటున్నారు అధికారులు.