DIWALI: ధన త్రయోదశి ఏ రోజున వచ్చింది? ఎలా పూజ చెయ్యాలి !

ధన త్రయోదశి తిథి అక్టోబర్ 29 వ తేదీ మంగళవారం రోజున వచ్చింది. అయితే ఈ ధనత్రయోదశి రోజు ఏం చెయ్యాలి. ధన త్రయోదశి పూజ లక్ష్మీ దేవి ని ప్రసన్నం చేయడానికి చేసుకుంటారు.


Published Oct 23, 2024 02:37:00 PM
postImages/2024-10-23/1729674524_diwali2024date.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ధంతేరాస్..వచ్చేస్తుంది . మన తెలుగు వాళ్లకు ధన త్రయోదశి. లక్ష్మి పూజ కు సిధ్ధమవుతున్నారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి అక్టోబర్ 29 వ తేదీ మంగళవారం రోజున వచ్చింది. అయితే ఈ ధనత్రయోదశి రోజు ఏం చెయ్యాలి. ధన త్రయోదశి పూజ లక్ష్మీ దేవి ని ప్రసన్నం చేయడానికి చేసుకుంటారు.


ధన త్రయోదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయండి. కొత్త చీరను ధరించండి. పూజ మందిరంలో  లక్ష్మీ దేవి పటాన్ని నిలుపుకొండి. మీ దగ్గర లేకపోతే పసుపు తో వినాయకుడు చేస్తాం కదా..అలా చేసుకొని లక్ష్మి దేవి అనుకొని పూజ చేసుకొండి.అలాగే ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను పాలతో కడగండి. ఆ తర్వాత నీటితో శుద్ధి చేయండి. వీటిని ధనలక్ష్మీ పూజలో ఉంచాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి బంగారు వెండి వస్తువు...కూడా లక్ష్మీ రూపమే.

బియ్యం , ధాన్యానికి కూడా హారతి ఇవ్వండి. దీపం , ధూపం వస్తువులకు చూపించండి.


* లక్ష్మీదేవి విగ్రహం ఎదురుగా వెండి ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలి.


*లక్ష్మీదేవిని కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి కుంకుమతో పూజించాలి. దీనినే 'చంద్ర' అని పిలుస్తారు. లేదా ఆకుపచ్చ రంగులో కుబేర కుంకుమ అని ఉంటుంది.. దానితో పూజించండి.


*"ఓం శ్రీం శ్రియ నమః" ఈ మంత్రం పఠిస్తూ పూజ చెయ్యండి.


* ఆ తర్వాత దానిమ్మ గింజల్లో కొద్దిగా తేనె కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి.ధనవృద్ధి కలగడం కోసం ధన త్రయోదశి రోజున ఇలా చేయండి..


ఈ పూజ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పొగొట్టి ...పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi lakshmi pooja diwali

Related Articles