Musk cars: ఎలెన్ మస్క్ కు ఉన్న కాస్ట్లీ కార్లు ఇవే ..! 2024-06-27 18:17:57

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎలక్ట్రిక్ కార్స్ ( ELECTRONIC TESLA) టెస్లా ఓ సంచలనం . అయితే టెస్లా ఓనర్ అయిన ఎలన్ మస్క్ ( ELEN MUSK) వేరే కంపెనీల కార్లను ముచ్చటపడి చాలా కార్లను కొనుక్కున్నారు. అయితే అందులో కొన్ని కార్లు..చాలా కాస్ట్లీ .  అయితే కొన్ని కార్లు కొన్నాళ్లు వాడి వదిలేసిన మస్క్ మరికొన్ని కార్లు మాత్రం తనతోనే ఉంచుకున్నారు.చిన్ననాటి డ్రీమ్ కారును ( DREAM CAR) కొనుగోలు చేసి సరదాగా షికార్లు చేశారు. ఓ కారును ఏకంగా అంతరిక్షానికి( SPACE) పంపించి తిరిగి తెప్పించుకున్నారు. అసలు వాటి సంగతేంటో చూద్దాం.


* ఫస్ట్ కారు బీఎమ్ డబ్ల్యూ( BMW E21 320I) ...ఈ21 320ఐ.. ఈ సిరీస్ లో వచ్చిన ఫస్ట్ కారును మస్క్ సొంతం చేసుకున్నారు. 2.0 లీటర్ ఇన్ లైన్ ఫోర్ ఇంజన్, 110 హెచ్ పీ సామర్థ్యంతో ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఇది. మస్క్ దీనిని అమ్మేసారు.


* 2012 లో పోర్షె కంపెనీకి( PORSE COMPANY)  చెందిన 911 టర్బో కారును( TURBO CAR)  మస్క్ కొనుగోలు చేశారు. ఈ కారు మీదున్న అభిమానమే టెస్లా కంపెనీ ఆవిష్కరణకు పరోక్ష కారణమని మస్క్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీ అమర్చాలంటూ అలాన్ కొకొని అనే ఇంజనీర్ ను మస్క్ సంప్రదించగా.. కొకొని నిరాకరించాడు. అతను ఇచ్చిన ఐడియాతోను ఎలెన్ టెస్లా కంపెనీ మొదలుపెట్టాటరు. 


 * జాగ్వార్ కారు ( JAGWAR CAR) మస్క్ చిన్నప్పటి డ్రీమ్ కారు.. ప్రపంచంలోనే అత్యంత అందమైన కారు ఏదంటే కార్ లవర్స్ చెప్పే పేరు జాగ్వార్ ఈ టైప్. దీనికోసం మస్క్ 265 హార్స్ పవర్, 4.2 లీటర్ల సిక్స్ ఇంజిన్ కారును కొనుగోలు చేశారు. ఇది ఎప్పటికి తన దగ్గరే ఉంటుంది.


* జేమ్స్ బాండ్( JAMES BOND)  సినిమాలో ఉపయోగించిన కారు ఇది. 2013లో వేలానికి వచ్చిన ఈ కారును మస్క్ సొంతం చేసుకున్నారు. నేల మీద వేగంగా దూసుకెళ్లే ఈ కారు.. నీళ్లల్లో సబ్ మెరైన్ లా మారిపోతుంది. 
* వాణిజ్యపరమైన అవసరాల కోసం తయారైన తొలి కారు టిన్ లిజ్జీ( TIN LIJJI)  . ప్రస్తుత కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ కార్లకు ఈ కారే స్ఫూర్తి . ఈ కారుకు మస్క్ తన కార్ల కలెక్షన్ లో చోటిచ్చారు. 


*ఏకంగా 600 హార్స్ పవర్ ( POWER) తో గంటకు 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ కారును మస్క్ కొంతకాలం పాటు ఉపయోగించారు. బీఎండబ్ల్యూ ఎం5 మోడల్ లో 5.0 లీటర్ వి10 ఇంజన్ ఉంది.
ఈ ఎనిమిది కార్లతో పాటు తన సొంత కంపెనీకి చెందిన సైబర్ ట్రక్( CYBER TRUK) , మోడల్ వై, మోడల్ ఎస్ లతో పాటు అంతరిక్షంలోకి పంపిన టెస్లా రోడ్ స్టర్ కారు కూడా మస్క్ గ్యారేజీలో ఉంది. అయితే  2018లో ఈ కారును అంతరిక్షంలోకి పంపడం ద్వారా మస్క్ ఈ కారు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశారు. ఇప్పుడు దీని వల్ల కోట్లు పలుకుతుందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు.