ఫిష్ బిర్యానీ కి వంజరం చేప తీసుకొండి. మీకు ముక్క చాలా బాగా ఉంటుంది.
అసలు ఫిష్ బిర్యానీ కి ఏం కావాలంటే ...
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చేపల వంటకాలు అంటేనే మెజార్టీ ముళ్లు కోసం భయపడతారు. ఫిష్ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. కాని ఇంట్లో ట్రై చెయ్యరు. అసలు సరిగ్గా జాగ్రత్తగా ట్రై చెయ్యాలి కాని సూపర్ టేస్టీగా ఫిష్ బిర్యానీ అధ్భుతంగా ఉంటుంది. పైగా దీని కోసం ఎక్కువ పదార్థాలూ అవసరం లేదు. మరి ముక్క చెదరకుండా సూపర్ టేస్టీ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. ఫిష్ బిర్యానీ కి వంజరం చేప తీసుకొండి. మీకు ముక్క చాలా బాగా ఉంటుంది.
అసలు ఫిష్ బిర్యానీ కి ఏం కావాలంటే ...
వంజరం చేపలు కేజీ తీసుకొండి.
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
బిర్యానీ ఆకులు - 3
దాల్చిన చెక్క - కొద్దిగా
లవంగాలు - 4
యాలకులు - 3
ఉల్లిపాయలు - 5
తరిగిన అల్లం - కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు - 8
పచ్చిమిరపకాయలు - 3
ఎండుమిరపకాయలు - 3
తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
నీళ్లు - సరిపడా
టమాటాలు - 3
పసుపు - 1 / 2 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్లు
కొత్తిమీర - గుప్పెడు
పుదీనా ఆకులు - గుప్పెడు
బాస్మతీ బియ్యం - 500 గ్రాములు
పలచటి కొబ్బరి పాలు - 500 మిల్లీలీటర్లు
తయారీ విధానం:
ఫిష్‌ను శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఫిష్ ను పసుపు , ఉప్పుతో కడుక్కొండి. స్మెల్ రాదు. చేపలకు ఉప్పు, కారం , పసుపు రాసి ఉంచుకోవాలి. ఇది చేస్తూ ఇంకో వైపు బాస్మతి రైస్ కడిగి పెట్టుకొండి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి నెయ్యి, నూనె పోసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ...ఉల్లిపాయలు ...టమాటా ముక్కలు ఫ్రై చేసుకొండి.
మిక్సీజార్ తీసుకుని అందులోకి తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి బాగా వేగించాలి. అన్ని కలిపి బాగా వేగిన తర్వాత చేప ముక్కలను వేసి చాలా స్లోగా వేయించుకొండి.
ఆ తర్వాత పల్చని కొబ్బరిపాలను పోసి...బాస్మతి రైస్ వేసి మెల్లగా కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. కుక్కర్ విజిల్స్ రాగానే ఆపేసి చల్లారాక కాసింత రైతాతో తినండి. సూపర్ .