ANIMAL FAT: మనం తినే కొన్ని పదార్ధాల్లో జంతువుల కొవ్వు ఉంటుందని తెలుసా ?

దాంతో మనం చే చాలాసార్లు మనకు తెలియకుండానే తినకూడాని పదార్థాలను కూడా తినేస్తాం. జంతువుల కొవ్వు విషయం కూడా ఇలాంటిదే.


Published Sep 22, 2024 11:47:00 AM
postImages/2024-09-22/1726985923_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  చాలామంది మేం ప్యూర్ వెజ్ అని అనుకుంటారు. కాని మనకు తెలీకుండానే మనం చాలా ఐటమ్స్ లో జంతువుల కొవ్వును తింటున్నాం. జంతువుల కొవ్వును కలిగి ఉండే కొన్ని సాధారణ ఉత్పత్తుల గురించి తెలుసుకెవల్సిందే. అయితే మనకి అమ్మే ప్రతి వస్తువు మీద ఆ ఐటమ్ లో వాడే వస్తువుల డీటైల్స్ ఇస్తారు కాని ..మనమే పెద్దగా పట్టించుకోం.దాంతో మనం చే చాలాసార్లు మనకు తెలియకుండానే తినకూడాని పదార్థాలను కూడా తినేస్తాం. జంతువుల కొవ్వు విషయం కూడా ఇలాంటిదే.


శాకాహారులు మాంసం, జంతువుల కొవ్వుకు దూరంగా ఉంటారు. కానీ, కొన్నిసార్లు తెలియకుండానే వారు జంతువుల కొవ్వును ఉపయోగించిన వాటిని తింటారు. అన్ిన జంతువుల కంటే ఎక్కువగా పంది కొవ్వును ఎక్కువగా వాడుతుంటారు. ఇది వివిధ ఆహారాలు, ఉత్పత్తులలో ఎక్కువగా కలుపుతుంటారని అంటున్నారు. ఫారన్ వస్తువులు చాలా ఫుడ్స్ పంది కొవ్వు , పంది మాంసం వాడకం చాలా సాధారణం.


*  వనస్పతి: కొన్ని రకాల వనస్పతిలో జంతువుల కొవ్వు ఉండే అవకాశం ఉంది. అదే డాల్డా...మన వాళ్లు నెయ్యి కి బదులుగా భయంకరంగా వాడతారు. ఇంకా ఇంట్లో చేసే బిస్కెట్లు , చాలా ఐటమ్స్ లో ఈ వనస్పతి కంపల్సరీ. వనస్పతి నెయ్యికి ఆల్ట్రనేటివ్...కాబట్టి మన ఇండియాలో వాడే బిస్కెట్స్ లో కూడా ఇదే వాడతారు.


* బిస్కెట్లు, కుకీలు: చాలా బిస్కెట్లు, కుకీలలో జంతువుల కొవ్వు ఉంటుంది. మీరు వెన్న రుచిగల బిస్కెట్లు, కుకీలను తీసుకుంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందు వాళ్లు ఇచ్చిన ఐటమ్స్ లిస్ట్ లో ఈ విషయాలుంటాయి. జాగ్రత్తగా గమనించండి.


* సాసేజ్‌లు: సాసేజ్‌లు, కొన్ని రకాల బార్‌లు, మీట్‌బాల్‌లు వంటి మాంసం ఆధారిత ఉత్పత్తుల్లో తరచుగా జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు. ఎందుకంటే నార్మల్ కొవ్వు లేదా వెన్న, నెయ్యి కంటే పందికొవ్వు ఎక్కువ శాతం ఆయిలీ ...క్యాలరీస్ ..వెయిట్ కలిగి ఉంటుంది. దీని కోసమే ఎక్కువ శాతం వీటిని కలుపుతారు.


* ఫాస్ట్ ఫుడ్: ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వంటి అనేక ఫాస్ట్ ఫుడ్స్ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తారు. దీని వల్ల వారికి ఆయిల్ ఖర్చు తగ్గుతుంది. బటర్ , ఆయిల్ , నూనె కంటే ఈ పంది కొవ్వు లేదా జంతువుల కొవ్వు తక్కువ ధరకు దొరుకుతుంది.


*సూప్‌లు, స్టాక్‌లు: రుచిని మెరుగుపరచడానికి జంతువుల కొవ్వును కొన్ని సూప్‌లు, స్టాక్‌లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సేమ్ అంటే ధర తక్కువ లాభాలు ఎక్కువ కాబట్టి మీరు ముందే అడిగినా చెప్పరు. అడ్జస్ట్ అయ్యి తాగేయడమే.


*చీజ్, పాల ఉత్పత్తులు: కొన్ని రకాల జున్ను, ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన చీజ్ లలో జంతువుల కొవ్వును కలుపుతుంటారని సమాచారం. ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కూడా ఈ జంతువుల కొవ్వును వాడుతుంటారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fatyacids biscuit

Related Articles