అమ్మ నాన్నల తర్వాత అద్భుతమైనటువంటి ప్రేమ బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమే. అలాంటి బంధాలు ఈ రోజుల్లో చాలావరకు మసకబారుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు అంటే చచ్చేవరకు కలిసి ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఒక్కొక్కరు డజన్ మంది పిల్లల్ని కన్నా చాలా ఆనందంగా జీవించేవారు. భార్య అంటే భర్తకు భర్త అంటే భార్యకు ప్రాణంగా జీవించేవారు.
న్యూస్ లైన్ డెస్క్: అమ్మ నాన్నల తర్వాత అద్భుతమైనటువంటి ప్రేమ బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమే. అలాంటి బంధాలు ఈ రోజుల్లో చాలావరకు మసకబారుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు అంటే చచ్చేవరకు కలిసి ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఒక్కొక్కరు డజన్ మంది పిల్లల్ని కన్నా చాలా ఆనందంగా జీవించేవారు. భార్య అంటే భర్తకు భర్త అంటే భార్యకు ప్రాణంగా జీవించేవారు.
కానీ ఆ బంధాలు ఈ రోజుల్లో కనిపించడం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు కాపురం చేసి పిల్లల్ని కని ఆ తర్వాత విడిపోతున్న జంటలు అనేకం ఉన్నాయి. భార్య మాట అంటే భర్త పడడం లేదు.భర్త మాట అంటే భార్య పడడం లేదు. చిన్న చిన్న విషయాలను గాలి వానలా మార్చుకుని చివరికి విడిపోతున్నారు. అలాంటి భార్యాభర్తల బంధం కలకాలం నిలిచి ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. దీనివల్ల మీ బంధం గట్టిగా బలపడుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
భార్యాభర్తలు రోజంతా పడిన కష్టం దగ్గర నుంచి చిన్న చిన్న ఆనందాల గురించి ప్రతి దాంట్లో పాలుపంచుకొని హ్యాపీగా జీవించాలి. ప్రతిరోజు ఏదో ఒక సమయాన్ని వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని అనుభవాలను పంచుకోండి. దీనివల్ల మీ మధ్య ప్రేమ సజీవంగా ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వయసు పెరుగుతుంది అనే ఫీలింగ్ వీరిలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ యంగ్ గా ఉన్నామని భావించాలి. భార్య భర్తలు ఎప్పుడైనా సరే కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉండాలి. వయసు పెరిగినా కానీ దంపతులిద్దరూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. సాధారణంగా దంపతులిద్దరూ ఎంత దగ్గరగా ఉండి మనసు విప్పుకొని మాట్లాడితే అంత ఆరోగ్యంగా జీవిస్తారు. అంతేకాకుండా ఒకరి కష్టాలు మరొకరికి తెలుస్తాయి.
దీనివల్ల వారి మధ్య ఎలాంటి అపార్ధాలు ఉండవు. సాధారణంగా భార్యాభర్తలకు వేరువేరు పనులు ఉంటాయి. ఆ పని నాది ఈ పని నీది అని వంతులు పెట్టుకోకుండా వీలైతే ఏ పనైనా చేయాలి. దీనివల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టు ఉంటుంది. దాంపత్య జీవితంలో ప్రధానమైంది ఫిజికల్ రిలేషన్ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తల మధ్య లైంగిక ఆసక్తి సరిగ్గా ఉంటేనే ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సాధారణమే. గొడవలను వీలైనంతవరకు సాగదీయకుండా ఎప్పటికప్పుడు పుల్ స్టాప్ పెట్టేలా చూసుకుంటే లైఫ్ ఎంజాయ్ చేస్తూ జీవించవచ్చని నిపుణులు అంటున్నారు.