GAS: గ్యాస్ సిలిండర్ త్వరగా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ? 2024-06-26 18:32:08

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  పట్నం అయినా, పల్లె అయినా నేడు దాదాపుగా అన్నిచోట్లా వంట చేయడానికి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. సిలిండర్ ( CYLLENDER) నెలకంటే ముందే అయిపోతుంటుంది. కానీ ధరలు పెరగడం వల్ల ఇది సామాన్యుడికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ టిప్స్ ఫాలో అయితే కాస్త ఎక్కువ రోజులు వస్తుంది.


1) మీ గ్యాస్  ఎక్కువ రోజులు రావాలంటే మాత్రం మీరు తడి పాత్రలను( WET CLOTHS)  ఎప్పుడూ కూడా గ్యాస్( GAS) పై పెట్టకూడదు. అలాగే పాత్రను పొడి గుడ్డతో తుడిచిన తర్వాతే స్టవ్ పై పెట్టండి. ఆ నీరు కాస్త ఆవిరై వేడెక్కి బోలెడు గ్యాస్ వేస్ట్ అవుతుంది.


2) వంట చేయడానికి మీరు ఎక్కువగా ప్రెజర్ కుక్కర్ల( COOKER) ను ఉపయోగించండి. ఎందుకంటే కుక్కర్ లో ఆహారం చాలా త్వరగా అవుతుంది. ఫాస్ట్ గ్యాస్ కలిసివస్తుంది.


3) గ్యాస్ బర్నర్( GAS )  లో చాలా మురికి పేరుకుపోతుంది. దీనివల్ల గ్యాస్ సరిగా మండకుండా వృథా అవుతుంది. 


4) చాలా సార్లు మనం పాలను ఫ్రిజ్( FRIDGE)  లోనుంచి బయటకు తీసి డైరెక్ట్ గా గ్యాస్ మీద పెడతాం. కానీ ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినవి..ఏవీ...అలా స్టవ్ మీద పెట్టకండి..ఆ ఐస్ కరగడానికి దాదాపు పావుగంట..గ్యాస్ వేస్ట్.