ఢిల్లీ నగరంలో పేద ప్రజలెవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ తిన్నంత భోజనం జస్ట్ ఒక్క రూపాయికే పెడతారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రూపాయికి చిన్న చాక్లెట్ కూడా రాని రోజులివి. కొన్ని స్వఛ్ఛంధ సంస్థలు తక్కువ ధరలు భోజనాలు పెడుతున్నారు. అయితే అదే పని చేస్తున్నాడు క్రికెటర్ గంభీర్. ఢిల్లీ నగరంలో పేద ప్రజలెవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ తిన్నంత భోజనం జస్ట్ ఒక్క రూపాయికే పెడతారు.
2014లో ఢిల్లీలోని పటేల్ నగర్‌లో తన పేరుమీద ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించారు గంభీర్. ఏక్ ఆశా జన్ రసోయీ ఫౌండేషన్‌లో పేదలకు అన్నం, కూర, చపాతీ లాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ క్యాంటీన్లలో దాదాపు వెయ్యి మందికి పైగా భోజనం చేస్తారు. అంతేకాదు ఆఫీస్ వర్క్ చేసేవాళ్లు వీళ్లు అందరు దాదాపు గా తక్కువ ఖర్చుతో ఇక్కడే భోజనం చేస్తారు.
ఏక్ ఆశా జన్ రసోయీ సేవలను గౌతమ్ గంభీర్ ఢిల్లీలో మరికొన్ని ప్రాంతంలోనూ ప్రారంభించనున్నారు. ఇదే తరహాలో కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఉండే చిన్న హోటల్ రోటీఘర్ కూడా రూపాయికి అన్నం, కూర, పప్పు లేదా సాంబారుతో కలిపిన భోజనాన్ని అందిస్తుంది. మహావీర్ యూత్ సంస్థాన్ అధ్వర్యంలో రోజువారి కూలీలకూ రూపాయి భోజనాన్ని రోటీఘర్ అందిస్తోంది. కోయంబత్తూరులోని ఆర్‌ఎస్ పురంలో కూడా పేదవాళ్లకు కడుపునిండా భోజనం కేవలం ఒక్క రూపాయికే అందిస్తోంది. అయితే రోజు కూలీ పనులు చేసేవారికి వారితో పాటు చిన్నా చితకా పనులు చేసేవారికి , భిక్షాటనతో బ్రతికే వారికి ఈ భోజన సదుపాయం చాలా ఉపయోగపడుతుంది.