diet: అసలు డైట్ చేసినపుడు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా ?

వెయిట్ ( weight)  తగ్గాలంటే ఎంత సేపు వర్కవుట్ చేసినా ఫుడ్ డైట్ లేకపోతే వెయిట్ లాస్ కష్టం. కాని చాలా మందికి డైట్( diet) చేసినపుడు జుట్టు రాలిపోతుంటుంది. ఇది చాలా మందిలో ఉంటుంది. ఇపుడు 1000లో 950 మందికి జుట్టు రాలిపోవడమే...పోషకాహారం తీసుకోకపోవడం ముఖ్య కారణం.


Published Jun 29, 2024 12:13:00 PM
postImages/2024-06-29/1719643537_cov16159832331616743692.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వెయిట్ ( weight)  తగ్గాలంటే ఎంత సేపు వర్కవుట్ చేసినా ఫుడ్ డైట్ లేకపోతే వెయిట్ లాస్ కష్టం. కాని చాలా మందికి డైట్( diet) చేసినపుడు జుట్టు రాలిపోతుంటుంది. ఇది చాలా మందిలో ఉంటుంది. ఇపుడు 1000లో 950 మందికి జుట్టు రాలిపోవడమే...పోషకాహారం తీసుకోకపోవడం ముఖ్య కారణం.

మీ డైట్‌లో( diet)  కేలరీలని తగ్గించడం లేదా బరువు పెరగడానికి ఎక్కువగా తినడం వల్ల జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అందవు. ముఖ్యంగా షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తిన్నా, జంక్ ఫుడ్ తిన్నా...డైరక్ట్ గా చెప్పాలంటే ...ఎలాంటి ప్రొటీన్ లేని ఐటమ్స్ తింటే ఆ ఎఫెక్ట్ హార్మోన్స్ పై పడుతుంది. దీని వల్ల జుట్టు రాలిపోతుంది

జుట్టుకు  తగినంత ప్రోటీన్( protein) తీసుకోవడం ముఖ్యం. ఇది తగ్గినప్పుడు పెరుగుదల తగ్గుతుంది. దీనికోసం గుడ్లు, మీట్, ఆకు పచ్చ కూరగాయలు, పండ్లు తినండి.ఐరన్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా జుట్టుని పెంచుతాయి. ఐరన్ లోపం కారణంగా హెయిర్ ‌ఫోలికల్స్‌కి అవసరమైన పోషకాలు అందవు. దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. జింక్ లోపం కలిగితే జుట్టు పెరుగుదల ఉండదు.


విటమిన్ బి 7, లేదా బయోటిన్( biotin) , మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత బయోటిన్ లేకపోతే జుట్టు పెళుసుగా మారి రాలుతుంది.


విటమిన్ సి.. మీ బాడీని ఐరన్( iron)  గ్రహించడంలో సాయపడుతుంది. ఇది తగ్గడం వల్ల జుట్టు డెన్సిటీ తగ్గుతుంది.


విటమిన్ డి లేకపోవడం వల్ల వెంట్రుకలు( hair) , కుదుళ్ళు బలహీనమై జుట్టు రాలుతుంది. కాబట్టి, తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.


మీరు కాని జుట్టు ( hair) కోసం ప్రత్యేకమైన ఆహారపుఅఅలవాట్లు  చేసుకోకపోతే.. మీ జుట్టు రాలిపోతుంది. సరైన నిద్ర, సరైన ఆహారపు అలవాట్లు ఉంటే ...సరైన ఆరోగ్యంతో పాటు హెల్దీ హెయిర్ కూడా ఉంటుంది.
 

newsline-whatsapp-channel
Tags : health-benifits life-style hair-fall hair-growth

Related Articles