Soundarya: సౌందర్య మరణిస్తుందని ఆయనకు ముందే తెలుసా..అయినా చెప్పలేదా.?

సౌందర్య.. ఆమె పేరులోనే ఎంతో సౌందర్యం ఉండేది. ఇక ఆమె యాక్టింగ్ గురించి చెప్పాలంటే మాటలు  పదాలు సరిపోవు. అలాంటి సౌందర్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేని హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. చిరంజీవి,


Published Sep 14, 2024 10:51:30 AM
postImages/2024-09-14/1726291290_soundaryadeath.jpg

న్యూస్ లైన్ డెస్క్: సౌందర్య.. ఆమె పేరులోనే ఎంతో సౌందర్యం ఉండేది. ఇక ఆమె యాక్టింగ్ గురించి చెప్పాలంటే మాటలు  పదాలు సరిపోవు. అలాంటి సౌందర్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేని హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో ఆమె తెరను పంచుకుంది. ఒక్కో సమయంలో  ఈ స్టార్ హీరోలే సౌందర్య డేట్స్ కోసం ఎదురు చూసేవారు. అలాంటి సౌందర్య  తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో కూడా ఎంతో గుర్తింపు పొందింది.

అలా ఆ టైంలోనే పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ఈమె విమాన ప్రమాదం వల్ల అకాల మరణం పొందింది. అయితే సౌందర్య  మరణ వార్త గురించి ఒక వ్యక్తికి ముందే తెలుసట. అయినా ఆమెను ఆపలేదని తెలుస్తోంది. మరి ఆయన ఎవరు..ఆ వివరాలు ఏంటో చూద్దాం. సౌందర్య మనవరాలు పెళ్లి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ సౌందర్య అని చెప్పవచ్చు. సౌందర్య బిజెపి ప్రచారం కోసం వెళ్తూ చిన్న తప్పిదం చేసి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

సౌందర్య సోదరుడు ఆమె ప్రచారానికి వెళ్లడం కోసం ముందుగా పెద్ద హెలికాప్టర్ బుక్ చేశాడట. కానీ ఆ హెలికాప్టర్ మూలయం సింగ్ ప్రచారంలో యూస్ చేసుకున్నారట. దీంతో సౌందర్యకు మరో చిన్న హెలికాప్టర్ బుక్ చేశారట. ఇది కేవలం టూ సీటర్ హెలికాఫ్టరట.  అయితే ఆమె ఫోర్ సీటర్ హెలికాప్టర్ వస్తుంది కావచ్చని లగేజ్ ఎక్కువగా తెచ్చుకుందట. లగేజ్ వెనక్కి పంపడం ఎందుకని అదే 2 సీటర్ హెలికాప్టర్లో పెట్టిందట.

ఇంకా హెలికాప్టర్ టేకప్ సమయంలో అలాగే వెనక్కి జరిగిపోవడం,అది కింద కూలిపోవడం జరిగి  సౌందర్య ఆమె సోదరుడితో పాటు అందరూ మరణించారట. అకాల మరణం చెందుతుందని తన తండ్రి సత్యనారాయణకు ముందే తెలుసట. కానీ ఆయన నమ్మలేదట. ఒక జ్యోతిష్కుడు  ఆమె అకాల మరణం చెందుతుందని ముందే చెప్పాడట. కానీ ఆయన అలా ఏం కాదని అపనమ్మకంతో ఉన్నాడట. కానీ సౌందర్య చివరికి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందింది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu venkatesh balakrishna nagarjuna soundarya amar sathyanarayana

Related Articles