HAIR: వర్షాకాలంలో జుట్టు తడిచి వాసన వస్తుందా .. ఈ చిట్కా ఫాలో చెయ్యండి

Published 2024-07-03 13:16:28

postImages/2024-07-03/1719992788_gettyc808272507634f70aa6d98066e37673e.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది ఆడవాళ్లు మాంచి తమాషాగా ...నూనె రాస్తారు...ఆ తర్వాత రోజే ఏదో పూజ, వ్రతం , లేదా అవసరం అంటు తలస్నానం చేస్తారు. షాంపూతో కాదు అలానే ఊరికే నీళ్లు పోసుకుంటారు. పోనీ జుట్టుని బాగా ఎండకి ఆరనిస్తారా ..అదీ లేదే..వెంటనే కొంపలు అంటుకుంటున్నట్లే జుట్టు ముడేసి మొగుడితో గొడవపడతారు...లేదా ఇంటి పనుల్లో మునిగిపోతారు..ఈ నూనె, తడి, డైలీ పడే దుమ్ము మూడు చేరి తలలో బాక్టీరియా ఫామ్ అవుతుంది. దీని వల్ల చాలా మంది జుట్టు నుంచి వాసన వస్తుంది.


చాలా మందికి జుట్టు ఓ మాదిరిగా ..ముక్కు వాసన వస్తున్నట్లు ఉంటుంది. ఎన్ని షాంపులూ పెట్టినా ..ఆ వాసన పోదు. చెమట పేరుకుపోవడం , లేదా ..జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉండడం వల్ల కూడా ఈ జుట్టు వాసన వస్తుంది. ఈ వాసన పోవాలంటే ...కొన్ని టిప్స్ ఫాలో చెయ్యండి.


తులసి నీరు: తులసి ( TULASI)   నీరు జుట్టు నుండి దుర్వాసనను తొలగించడానికి మీకు సహాయం చేస్తుంది. తులసి నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. తులసి నీరు తలస్నానం చేసినా పర్లేదు. లేదా తులసి మిక్సీ పట్టి ఆ ఆకు పేస్ట్ ను ప్యాక్ లా వేసినా పర్వాలేదు. దీని స్మెల్ తగ్గడమే కాదు...చుండ్రుసమస్యలు తగ్గుతాయి.


నిమ్మరసం: జుట్టు నుండి దుర్వాసనను తొలగించడానికి నిమ్మరసాన్ని( LEMON WATER) నీటితో కలిపి స్నానం చేయండి. మీరు మీ జుట్టును షాంపూ చేసిన తర్వాత ప్రాథమికంగా ఈ నీటితో స్నానం చేయండి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను( BAKING SODA)  నీటిలో కలపండి .ఆ నీటితో మీ జుట్టును కడగాలి. ఇలా చేసినా కూడా తల లో నుంచి దుర్వాసన పోతుంది. ఇక..  వర్షాకాలంలో మీ జుట్టుకు అదనపు సంరక్షణ ఇవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. 


ఒకప్పుడు ఈ సమస్యలు ఉండేవి కాదు...ఎందుకంటే కుంకుడు రసంతో తలస్నానం చేసేవారు. దీని వల్ల శరీరానికి కాని తల కు కాని ఎదైనా మచ్చలు , ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా వెంటనే తగ్గిపోయేవి. ఇఫ్పుడు మాత్రం షాంపూ కదా...సగం అలర్జీలు ఆ షాంపూ నురగకే.  సో ఓ సారి ఈ టిప్స్ ట్రై చెయ్యండి.