Natukodi Pickle: చికెన్ పచ్చడి పెట్టాలంటే ..ఇదే కరెక్ట్ పధ్ధతి !

బాయిలర్ కంటే నాటు కోడి పచ్చడికి ట్రై చెయ్యండి. సూపరంటే సూపర్ . పోనీ  అసలు చికెన్ పచ్చడి ఎలా చేస్తారో నేర్చేసుకుందాం రండి.


Published Nov 18, 2024 10:14:00 PM
postImages/2024-11-18/1731948333_download.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చికెన్ పికిల్ పెట్టాలంటే కాస్త తెలిసి ఉండాలి. లేదంటే పెట్టిన పెట్టుబడి అంతా వేస్టే. నిల్వ ఉండాలి ...రుచి కూడా బాగుండాలి. బాయిలర్ కంటే నాటు కోడి పచ్చడికి ట్రై చెయ్యండి. సూపరంటే సూపర్ . పోనీ  అసలు చికెన్ పచ్చడి ఎలా చేస్తారో నేర్చేసుకుందాం రండి.


నాటుకోడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పచ్చడి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పొడి, గరం మసాలా, నిమ్మరసం. అన్ని రెడీ చేసుకొని పెట్టుకొండి.


ముందుగా నాటుకోడిని చిన్న ముక్కలు చేయించి పెట్టుకొండి.  తర్వాత చికెన్ కు కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఓ అరగంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఓ కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేయండి. చాలా బాగా వేయించుకొండి. చికెన్ లో నీరు శాతం తగ్గిపోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేయండి. నీరంతా ఇంకిపోయి.. కూర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. బాగా వేగిన ముక్కలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి . గుర్తు పెట్టుకొండి.


ఆ తర్వాత మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిన్న మంట మీదనే వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, ఆవ పొడి, పసుపు వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న మంట మీదనే ఓ ఐదు నిమిషాలు కలపాలి. ఇప్పుడు వేయించిన చికెన్ కూడా వేసి ఇందులో మళ్లీ ఫ్రై చేయాలి. కారం, మసాలాలు ముక్కకు బాగా పడతాయి. బాగా చల్లారాక నిమ్మరసం వేసుకొండి. అంతే అయిపోయింది. మినిమమ్ 6 నెలలు గ్యారెంటీ.
 

newsline-whatsapp-channel
Tags : news-line chicken healthy- tasty mango-pickle

Related Articles