bigboss8: బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చేది అల్లుఅర్జున్ అట !

గౌతమ్ vs నిఖిల్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ త్వరలోనే ఉండబోతుంది


Published Dec 12, 2024 09:18:00 PM
postImages/2024-12-12/1734018548_images2.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది.  ఇంకో రెండే రోజులు ..ఫైనల్స్ లో ఎవరు కప్ గెలుస్తారో తెలుస్తుంది. ఊహించని విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీలతో సీజన్ అంతా అన్ లిమిటెడ్ ట్విస్టులు , అన్ లిమిటెడ్ ఫన్ తో సాగిన బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ సీజన్స్ తో కంటే ఎక్కువ రేటంగ్  తెచ్చుకుంది. గౌతమ్ vs నిఖిల్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ త్వరలోనే ఉండబోతుంది.


అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఐకాన్ సార్ అల్లు అర్జున్ విజేతకు ట్రోఫీ అందించటానికి రానున్నట్టు సమాచారం. అయితే  బిగ్ బాస్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు కాని టాక్ మాత్రం నడుస్తుంది. అల్లుఅర్జున్ ఈ షోకి చీఫ్ గెస్ట్ గా వస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు పుష్ప క్రేజ్ చూసి ఇలా చెబుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.


 గత సీజన్ కి మాత్రం చీఫ్ గెస్ట్ రాలేదు. నాగార్జుననే విన్నర్ కి ట్రోఫీ అందించారు. గత సీజన్ కి కూడా సెలబ్రిటీ ఎవ్వరు రాకపోవడంతో ఈ సీజన్ కి పెద్ద స్టార్ ని తీసుకురావాలి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ సీజన్ కి అల్లు అర్జున్ ను తీసుకొస్తునట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ బజ్ పెంచడానికి ఫినాలే రేటింగ్ కోసమే ఈ ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ టాక్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna allu-arjun bigboss8

Related Articles