IRCTC: దుబాయ్​ బుర్జ్​ ఖలీఫా టూర్ -IRCTC అధ్భుతమైన ప్లాన్ !

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ది స్ప్లెండర్స్ ఆఫ్ దుబాయ్ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది.


Published Dec 07, 2024 03:25:00 PM
postImages/2024-12-07/1733565366_PlanningaSoloTriptoDubai002.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  దుబాయ్ ..చాలా లగ్జరీ కంట్రీ. ఎన్నో విలాసాలు కలిగిన దేశం కూడా.. అయితే ఈ బ్యూటిఫుల్ డెస్టినేషన్ కు ప్లాన్ చేసుకుంటున్నారా ..అలా అయితే ఐఆర్ సీటీసీ మంచి టూర్ ప్లాన్ ను సిధ్దం చేసింది. జస్ట్ ఐదు రోజుల్లో భూర్జ్ కలీఫా ను చుట్టి వచ్చేయొచ్చు అసలు ఎలా ప్లాన్ చేసిందో చూద్దాం.ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ది స్ప్లెండర్స్ ఆఫ్ దుబాయ్ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది.

ఇది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం 4 రాత్రులు ,5 పగళ్లు ఈ ప్యాకేజీలో దుబాయ్ , అబుదబిలోని చాలా ప్లేసెస్ ను విజిట్ చెయ్యొచ్చు. ఈ టూర్​లో 34 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది.లిమిటెడ్ ప్రయాణికులు మాత్రమే ఐ ఆర్ సీటీసీ టూర్ ప్లాన్ చేస్తుంది.


* మొదటి రోజు ఉదయం హైదారాబాద్ టు దుబాయ్ ..ఫ్లైట్ . 1 గంటకు దుబాయ్​ రీచ్​ అవుతారు. అక్కడ ఎయిర్​పోర్ట్​లో ఫార్మాలిటీస్​ పూర్తి చేసుకుని లంచ్​కు ఇండియన్​ రెస్టారెంట్​కు వెళ్తారు. 


* రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హాఫ్​ డే దుబాయ్​ సిటీ టూర్ ఉంటుంది. అందులో భాగంగా దుబాయ్​ మ్యూజియం విజిట్​ చేస్తారు. ​ 


*మూడో రోజు టిఫెన్​ తర్వాత దుబాయ్​ ఫ్రేమ్​, మ్యూజియం ఆఫ్​ ది ఫ్యూచర్​ విజిట్​ చేస్తారు. ఇండియన్​ రెస్టారెంట్​లో లంచ్​ ఉంటుంది. క్రూజ్ లో భోజనం కూడా చేస్తారు. 


* నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ చెక్​ అవుట్​ చేసిన తర్వాత అబుదాబి సిటీ టూర్​ ఉంటుంది. అందులో భాగంగా గ్రాండ్ మసీదు, BAPS హిందూ మందిర్ దర్శించుకుంటారు. 


*ఐదో రోజు తెల్లవారుజామున దుబాయ్​ నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. 9 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.


* కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.1,21,100, డబుల్​ షేరింగ్​కు రూ.1,04,620, ట్రిపుల్​ షేరింగ్​కు రూ. రూ.1,02,225 గా నిర్ణయించారు.​ ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ జనవరి 23, 2025వ తేదీన అందుబాటులో ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dubai railway-department life-style

Related Articles