Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్ !

ఎన్టీఆర్ సినిమా దేవర కూడా జపాన్ లో రిలీజ్ చెయ్యడానికి జపాన్ వెళ్తున్నాడు ఎన్టీఆర్.


Published Feb 25, 2025 03:50:00 PM
postImages/2025-02-25/1740478886_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మన తెలుగు సినిమాలకు ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన సినిమాలని అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో మన స్టార్ హీరోలంతా వాళ్ల సినిమాలను జపాన్ లోను రిలీజ్ చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా దేవర కూడా జపాన్ లో రిలీజ్ చెయ్యడానికి జపాన్ వెళ్తున్నాడు ఎన్టీఆర్.


ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా జపాన్ లో రిలీజవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన దేవర సినిమా గత సంవత్సరం రిలీజయి మంచి విజయం సాధించింది.  ఇప్పటి వరకు బాలీవుడ్ , టాలీవుడ్ లో 500 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు దేవర సినిమా జపాన్ లో మార్చ్ 28 న రిలీజ్ అవుతుంది, దీని కోసం ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్స్ కి రంగంలోకి దిగారు.


ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ మీడియాకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటో ఎన్టీఆర్ టీమ్ షేర్ చేసింది. ఇక దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చ్ 22న జపాన్ వెళ్లనున్నారు. గతంలో ఎన్టీఆర్ RRR ప్రమోషన్స్ కి తర్వాత ప్రైవేట్ వెకేషన్ కి జపాన్ వెళ్లారు. ఇప్పుడు మళ్లీ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తున్నారు. జపాన్ లో ఎన్టీఆర్ కి భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu jr-ntr movie-news

Related Articles