KTR: కాంగ్రెస్ పాలన కంపుమయం

పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు. BRS అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా పంచాయితీలకు రూ.275 కోట్లు విడుదుల చేశామని ఆయన గుర్తుచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్ లను నిర్బంధించారని, అక్రమంగా అరెస్టులు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


Published Aug 14, 2024 12:07:43 PM
postImages/2024-08-14/1723617463_KTRbrs.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పాలన కంప్యూమాయమైందని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లోని అభివృద్ధి పనులు ఆగిపోయాయి. తాజాగా, ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపుకొడుతున్నాయని విమర్శించారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు అప్పులపాలయ్యారని గుర్తుచేశారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని కేటీఆర్ వెల్లడించారు.

కనీసం దోమల ముందుకు కూడా నిధులు లేవని, దీంతో గ్రామాల్లోని ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారని ఆయన అన్నారు. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు. BRS అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా పంచాయితీలకు రూ.275 కోట్లు విడుదుల చేశామని ఆయన గుర్తుచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్ లను నిర్బంధించారని, అక్రమంగా అరెస్టులు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఎప్పుడు ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని నిలదీశారు. 12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిల అంచనా రూ.4305 కోట్లు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేటర్ తోపాటు.. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేశారని తెలిపారు.

ఆగష్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా అని అడిగారు. మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. BRS హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం.. కాంగ్రెస్ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని కేటీఆర్ హెచ్చరించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy newslinetelugu brs congress ktr telanganam congress-government sarpanch ktrbrs

Related Articles