గురుకుల స్కూళ్లల్లో సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం సంతోషమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా విద్యార్థులకు మెరుగైన విద్యా, భోజనం, వసతులు కల్పించాలని కోరారు. మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: గురుకులాల విషయంలో మొద్దునిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టిలేపామని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాలను పరిశీలించేందుకు వెళ్లడంపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
గురుకుల స్కూళ్లల్లో సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం సంతోషమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా విద్యార్థులకు మెరుగైన విద్యా, భోజనం, వసతులు కల్పించాలని కోరారు. మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉందన్నట్లు మొద్దునిద్రలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌ను మేల్కొనేలా చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.