Mad Honey :మ్యాడ్ హానీ గురించి తెలుసా ..ఈ తేనె కు సాధారణ తేనెకు తేడా ఏంటి ?

Published 2024-07-03 15:42:51

postImages/2024-07-03/1720001571_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  మ్యాడ్ హానీ( MAD HONEY) ...ఆయుర్వేదం( AYURVEDAM) గురించి తెలిసిన వారికి తప్ప మరెవ్వరికి ఈ తేనె సంగతి లేదు. అయితే నార్మల్  తేనె ..చాలా స్వీట్ ఉంటుంది. అదే మ్యాడ్ హానీ మాత్రం చాలా చేదు ఉంటుంది. కాని చూడ్డానికి ఒకేలా ఉంటాయి. అది ఎక్కడ లభిస్తుంది? దాన్ని తాగితే ఎందుకు అలా అవుతుంది? తేనెటీగలు ఆ తేనెను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి? 


తేనె తియ్యగా ..ఎన్నాళ్లయినా నిల్వ ఉంటుంది కదా...కాని ..ఈ  పిచ్చి తేనె మాత్రం చాలా డిఫరెంట్ . భ్రమలు (psychedelic) కలిగించగలదు. రెండు చెంచాలు తాగితే చాలు.. కళ్లు తిరుగుతాయి. మత్తు వచ్చేస్తుంది. తల తిరుగుతుంది. ఐతే... ఈ తేనె ( HONEY) ఎంతో ఆనందం ఇస్తుంది. ఆ మత్తు స్వర్గంలో ఉన్న ఫీల్ కలిగిస్తుంది. బాగుంది కదా అని మరింత తాగితే... తేడా కొడుతుంది. వాంతులవుతాయి. మూర్ఛ (seizures) వస్తుంది. అరుదైన సందర్భాల్లో మరణమూ వస్తుంది. ఎంత తక్కువ తాగితే అంత మజా.


అరుదైనవి ఖరీదుగానే ఉంటాయి కదా. ఈ తేనె కూడా అంతే. ధర ఎప్పుడూ కొండపైనే ఉంటుంది. ఇది ప్రధానంగా నేపాల్‌ (Nepal)లో లభిస్తుంది. లేదా సముద్రపు గుహలు...అరుదైన ఎత్తైన కొండల మీద దొరుకుతుంది. నేపాల్ లో అయితే చాలా విరివిరిగా దొరుకుతుంది. అక్కడి ప్రజలు దీన్ని ఔషధం (Medicine) గా వాడుకుంటున్నారు. దీని రుచి చేదుగా ఉంటుంది. 2018లో జరిపిన అధ్యయనం ప్రకారం.. ఈ తేనెను క్రీస్తుపూర్వం 2,100 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. మొదటి సారి తాగే వారికి ఈ తేనె కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.


"సాధారణ తేనెలో లేని గ్రాయానోటాక్సిన్స్ (grayanotoxins) అనేది ఈ తేనెలో ఉంది. అదే మత్తు లేదా విషం లా మనపై పనిచేస్తుంది" తేనెటీగలు పువ్వుల పుప్పొడి నుంచి గ్రాయానోటాక్సిన్స్‌ ని కూడా తేనెటీగలు సేకరిస్తున్నాయి. వాటికి తెలియకుండానే దీన్ని సేకరిస్తున్నాయి. అవి తేనె పోగేస్తున్నామని అనుకుంటూ... విషాన్ని కూడా అందులో చేర్చుతున్నాయన్నమాట. అందుకే ఈ చేదు. అయితే  ఈ చేధు కూడా ఆరోగ్యానికి తక్కువ మొత్తం లో మంచిది. ఈ తేనె..మగవారికి నేచురల్ వయాగ్రాలా పనిచేస్తుంది. ఆడవారికి సంతాన సమస్యలు తగ్గిస్తుంది. పొట్టలో అల్సర్లు, గ్యాస్ సమస్యలు అజిర్తీ సమస్యలు హైబీపీ ఒక్కటేంటి ...చిన్న చెంచాతో మీకు ఫుల్ మీ శరీరాన్ని స్వీప్ చేసేస్తుంది. కాని కేజీ తేనె ధర 15 నుంచి 20 వేల రూపాయిలు. కాబట్టి బయటదేశాల్లో మంచి గిరాకీ ..మన భారతీయులు చాలా తక్కువ.