ttd: తిరుపతి లడ్డు వల్లే ఈ నిర్ణయం ..ఉత్తరాధి దేవాలయాల్లో కొత్త రూల్స్ ​!

ఉత్తరాధి దేవాలయాల్లో కొత్త రూల్స్ ను మొదలుపెట్టారు. స్వామి వారికి సేవలకు ఎలాంటి అంతరాయం రాకుండా కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు.


Published Sep 23, 2024 04:47:00 PM
postImages/2024-09-23/1727090285_SriMoolaRamaSriMoolaSitaandSriDigvijayaRamadeitiesatUttaradiMatha.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన కల్తీ నెయ్యి విషయం యావత్తు భారత్ ను కుదిపేస్తున్నాయి. స్వామి వారి ప్రసాదంలో పశువుల కొవ్వు వాడుతున్నారనే వార్తలు ఇప్పుడు భారత్ హిందువులందరి మనసును గాయపరిచింది. దీని కారణంగా ఉత్తరాధి దేవాలయాల్లో కొత్త రూల్స్ ను మొదలుపెట్టారు. స్వామి వారికి సేవలకు ఎలాంటి అంతరాయం రాకుండా కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు.


తాజాగా ఉత్తర్​ప్రదేశ్​, లఖ్​నవూలోని మంకమేశ్వర ఆలయ నిర్వాహకులు, మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను దేవునికి ప్రసాదంగా నివేదించడాన్ని పూర్తిగా నిషేధించారు. బయట దుకాణాల నుంచి తెచ్చిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భగుడిలోకి తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. తిరుమల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.


అంతేకాదు స్వామివారికి..దేవుళ్లకు భక్తులు చేసిన ప్రసాదాలు కూడా గర్భాలయాలకు తీసుకురాకూడదని తేల్చిచెప్పారు. ఎలాంటి పధార్ధాలు వాడుతున్నారనే విషయం పురోహితులకు తెలియకుండా స్వామి వారి సన్నిధికి  ప్రసాదం రాకూడదని తెలిపారు.  ఇక పై పెద్ద పెద్ద దేవాలయాల్లోనే కాదు చిన్న దేవాలయాలకు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : ghee temples tirumala-prasadalu tirumala-laddu

Related Articles