ఎలాంటి ఇబ్బందులు రాకుండా గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాంమని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: నాయక చవితి ఏర్పాట్లపై శనివారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు పై అన్ని శాఖల తో మీటింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈరోజు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందని అన్నారు. దేశంలో ముంబై తరువాత హైదరాబాద్‌లోనే గణేష్ ఉత్సవాలు గ్రాండ్‌గా జరుగుతాయని పొన్నం తెలిపారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాంమని వెల్లడించారు. హుసేన్ సాగర్ నిమజ్జనం అనే అంశం కోర్టు ఆదేశాలు ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ముందే సమాచారం ఇవ్వాలని పొన్నం సూచించారు. దీంతో విగ్రహాల లెక్కను బట్టి.. వాహనాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.