Mohan Lal : ఆర్మీ ఆఫీసర్ హోదాలో వయనాడ్ లో పర్యటించిన మోహన్ లాల్

సినీ నటుడు మోహన్ లాల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


Published Aug 03, 2024 05:21:23 AM
postImages/2024-08-03/1722680329_MohanLal.jpg

న్యూస్ లైన్ డెస్క్ : కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి మరకు మరణించిన వారి సంఖ్య 358కి చేరింది. దేశాన్ని మొత్తం కుదిపేసిన ఈ ఘటన ఈ ఏడాదిలో అతిపెద్ద విషాదంగా మిగలనుంది. కాగా.. వయనాడ్ లో పలువురు ప్రముఖులు పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెప్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సినీ నటుడు మోహన్ లాల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

బాధితులకు ధైర్యం చెప్పిన మోహన్ లాల్ ముండక్కై, చుర్మూలాల్ సహా కొండ చరియలు విరగిపడిన పలు ప్రాంతాల్లో మోహన్ లాల్ పర్యటిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి గాయపడ్డ వారిని పరామర్శించారు. ఇప్పటికే బాధితులకు మద్దతుగా కేరళ సీఎంఆర్ఎఫ్ నిధికి మోహన్ లాల్ రూ.25 లక్షల విరాళం అందించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వలంటీర్లు, అధికారులు, సైన్యం, పోలీసులు, వైద్యులను ఆయన అభినందించారు.

newsline-whatsapp-channel
Tags : rains latest-news telugu-news wayanad kerala wayanadfloods

Related Articles