ప్రైవేట్ కోర్టులో యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ వేషధారలో మెరిసిపోయారు. సింహాసనన దర్బార్ ను కూడా నిర్వహించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దసరా పండుగ సందడి కర్ణాటకలో ఓ రేంజ్ లో సాగుతుంది. ఆ రాష్ట్ర పండుగ దసరా నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యంగా మైసూరు దసరా ఉత్సవాలకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభం అయ్యాయి. దసరా మహోత్సవాలను 2024 ను ప్రారంభించారు. ప్రైవేట్ కోర్టులో యదువీర కృష్ణదత్త చామరాజ వడయార్ రాజ వేషధారలో మెరిసిపోయారు. సింహాసనన దర్బార్ ను కూడా నిర్వహించారు.
యదువీర్ రాజు వేషధారణలో అతని భార్య త్రిషికాకుమారి యదువీర పాదపూజ చేశారు. మైసూర్ రాష్ట్ర గీతం ఆలపించారు. తెల్లవారి నుంచి మంగళ స్నానం చేసి చాముండేశ్వరికి పూజలు చేసిన అనంతరం యదువీర్ కంకణం ధరింపజేశారు. ఈ తొమ్మిది రోజులు ఎంతో నియమ నిష్టలతో పూజలు చేస్తారు. ఈ సమయంలో రాజభవనంలోని కోడి సోమేశ్వరాలయం నుంచి ఏనుగు, ఆవు, గుర్రంతో వచ్చిన వాటిని తీసుకుని దర్భార్ లో ముందుకు సాగారు.
ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో ప్యాలెస్‌లోకి ప్రజలు ప్రవేశించకుండా నిషేధించారు. ఇది కేవలం రాజ కుటుంబానికి మాత్రమే అనుమతి ఉంది . చాముండేశ్వరీ దేవీకి కుటుంబమంతా పూజలు చేస్తారు. కుంకుమార్చనలతో పాటు కావేరీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇఫ్పుడు మైసూరు చాలా అందంగా అలంకరించబడి ఉంది.