అక్కినేని కుటుంబ పరువు కొండ సురేఖ చెడగొట్టేలా మాట్లాడారు ఆరోపించారు.ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్కినేని కుటుంబ పరువు కొండ సురేఖ చెడగొట్టేలా మాట్లాడారు ఆరోపించారు.ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
దీనిని విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. మంత్రికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు జరిగే విచారణకు కొండా సురేఖ హాజరు కావాలని ఆదేశించింది.నాగచైతన్య, సమంత విడాకులకు నాగార్జునే కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డ్ చేసింది. తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పినా నాగార్జున తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖను తప్పు పట్టారు.