IL-11 Protein: మనిషికి ముసలితనం ఎలా వస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు !

మనిషి నిత్యయవ్వనం గా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నో యేళ్ల ప్రయత్నాలకు చిన్న బూస్ట్ దొరికింది . అసలు మనిషికి ముసలితనం ఎలా వస్తుందో కనిపెట్టేశారు సైంటిస్టులు. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ..వయసును 25 యేళ్లు పెంచగలిగారు.


Published Jul 19, 2024 01:21:34 AM
postImages/2024-07-19/1721370057_ageeffect.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనిషి నిత్యయవ్వనం గా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నో యేళ్ల ప్రయత్నాలకు చిన్న బూస్ట్ దొరికింది . అసలు మనిషికి ముసలితనం ఎలా వస్తుందో కనిపెట్టేశారు సైంటిస్టులు. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ..వయసును 25 యేళ్లు పెంచగలిగారు.


వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్ - 11 అనే ప్రొటీన్ కారణమవుతోందని సింగపూర్‌లోని డ్యూక్ - ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనిషి హార్ట్ , కిడ్నీ, లంగ్స్ , లివర్ ఇలా ప్రతి అవయవం తన పనితీరుపై ఐఎల్ -11 కీలక ప్రభావం చూపే ఓ ప్రొటీన్ ను కనిపెట్టారు.వయసుతో పాటు ఈ ప్రొటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు. ఫిజికల్ ఫిట్ నెస్ ఎక్కువగా ఉండేవారికి ఈ ప్రోటీన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. దీని వల్లే వాళ్లు ఎన్నాళ్లయినా యంగ్ గా కనిపిస్తున్నారని తెలిపారు.


ఐఎల్-11 ప్రొటీన్‌ను నిరోధించిన శాస్త్రవేత్తలు ఎలుకల జీవిత కాలాన్ని 25 శాతం మేర పెంచగలిగారు. ఆడ ఎలుకల్లో ఐఎల్-11 నిరోధక చికిత్స ద్వారా శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత, మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. అది కూడా ఆడ ఎలుకలు 25 సంవత్సరాలు పెరిగితే ..మగఎలుకలకు మాత్రం 22.5 శాతం మేర పెరిగింది. ఐఎల్-11 చికిత్సతో వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు. ఐఎల్-11 చికిత్స వయసు మీద పడిన వారికి చేస్తే ఎక్కువ రిజల్్ట చపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రొటీన్ ను పెంచి ముసలితనం రాకుండా కొన్నాళ్లు కంట్రోల్ చెయ్యొచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style

Related Articles