oil:  రాత్రి పూట నూనె రాసుకుంటున్నారా .. మీ స్కిన్ డ్యామేజీ గ్యారెంటీ 


నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుబారి అంద విహీనంగా కనిపిస్తామంటూ మరికొందరు కొబ్బరినూనె ఊసే ఎత్తడానికి చిరాకుపడతారు. నాకు తెలిసి మగపిల్లలు అయితే నూనె రాసి ఎన్నేళ్లు అయ్యి ఉంటుందో ..


Published Jul 25, 2024 06:58:00 PM
postImages/2024-07-25/1721914127_haircare1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తల నిండా నూనె పెట్టుకొని టైట్ గా జడేసుకోవడం అనేది ఇప్పటికి ఇక తీరదు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా ...లేచామా...రెడీ అయ్యామా ...పడుకున్నామా..లైఫ్ సూపర్ స్పీడ్ లో వెళ్లిపోతుంది. దానికి తోడు తలకు నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుబారి అంద విహీనంగా కనిపిస్తామంటూ మరికొందరు కొబ్బరినూనె ఊసే ఎత్తడానికి చిరాకుపడతారు. నాకు తెలిసి మగపిల్లలు అయితే నూనె రాసి ఎన్నేళ్లు అయ్యి ఉంటుందో ..


 తలకు క్రమంగా నూనె పట్టించి మర్దన చేయడం వల్ల కాల క్రమంలో దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నూనె  రాసుకొని మర్ధన చేయడం వల్ల తలకు బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.నూనె వల్ల  తలకు సంక్రమించే ఫంగల్, డ్యాండ్రఫ్ సమస్యల నుండి కూడా కొబ్బరినూనె కాపాడుతుంది. తల నల్లగా ఉంటుంది.. అంటే తెల్ల వెంట్రుకలు ఉండవు.  సైంటిఫిక్ గా రుజువు కానప్పటికీ తలకు క్రమం తప్పకుండా కొబ్బరి నూనె రాయడం వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు నల్లపడకుండా నిరోధించవచ్చు. 


 తలకు నూనె రాసుకోవడం ఎంత మంచిదో అంత చెడు కూడా..నూనె జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల పింపుల్స్ వచ్చేస్తాయి. అంతేకాదు..స్కిన్ మీద యాక్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి స్కిన్ డ్యామేజీ అవుతుంది...రాత్రి టైం లో రాసి పొద్దున్నే షాంపూ పెట్టే వాళ్లకి తల చాలా డ్రై అయిపోయి ఉంటుంది. దీని వల్ల చుండ్రు సమస్య ఉంటుంది. చుండ్రు సమస్య వల్ల నూనె రాసినా ఆ చుండ్రు ..ఈ నూనె స్కిన్ మీద పింపుల్స్ వస్తాయి. తల దురద పెడితే గొక్కొని ...స్కిన్ మీద ముట్టుకుంటే పింపుల్స్ వచ్చేస్తాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health skin-problems

Related Articles