సిగరెట్ల కోసం షూటింగ్ ఆపిన ఎన్టీఆర్..ఎందుకంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్న ఎన్టీఆర్ అంటే ఎంతటి పాపులారిటీ ఉంటుందో మనందరికీ తెలుసు. 1964 నాటి గుడిగంటలు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర బాగా సిగరెట్లు తాగడం.


Published Sep 14, 2024 03:29:00 PM
postImages/2024-09-14/1726307940_srntr.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్న ఎన్టీఆర్ అంటే ఎంతటి పాపులారిటీ ఉంటుందో మనందరికీ తెలుసు. 1964 నాటి గుడిగంటలు సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర బాగా సిగరెట్లు తాగడం. వాస్తవానికి రామారావు బయట సిగరెట్లు కాల్చరు. ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం తప్పకుండా రెండు డబ్బాలకు పైగా  స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు కాల్చేవారట. ఇలా ఈ గుడిగంటలు సినిమా షూటింగ్ కోసం  రెండు డబ్బాలు స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు తెప్పించి  రెడీగా పెట్టేవారట చిత్ర యూనిట్ వారు.

ఈ చిత్రానికి వి మధుసూదన్ డైరెక్టర్. అయితే ఎన్టీఆర్ మేకప్ రూమ్ లో ఉండగా  ఆయన కోసం తెచ్చినటువంటి సిగరెట్ డబ్బాను ప్రొడ్యూసర్ ఒకటి, రైటర్ ఒకటి తీసుకొని కాల్చారు. అయితే ఎన్టీఆర్ మేకప్ వేసుకుంటూనే సిగరెట్ డబ్బా తేవాలని కబురు పంపారు. అయితే వచ్చిన బాయ్ కి రెండు సిగరెట్లు కాల్చిన తర్వాత మిగతా సిగరెట్లు ఆయనకు అందించారు. పట్టుకొని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లగానే ఎన్టీఆర్ చాలా సీరియస్ అయిపోయి  ఇందులో రెండు సిగరెట్లు ఏమయ్యాయని అడిగాడట.

వెంటనే ఒకటి ప్రొడ్యూసర్ గారు మరొకటి రైటర్ గారు కాల్చారండి అని చెప్పగానే మరింత సీరియస్ అయి, కొత్త సిగరెట్ డబ్బా తేస్తేనే నేను షూటింగ్ లోకేషన్ కి వస్తానని అన్నారట. దీంతో ప్రొడ్యూసర్ పోయిందేముందులే ఒక కొత్త సిగరెట్ డబ్బా తీసుకురమ్మని బాయ్ ని పంపారట. ఆరోజు ఆ సిగరెట్లు దొరికే షాప్ కు వెళ్లేసరికి అక్కడ స్టాక్ అయిపోయింది. దీంతో ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్ ను పట్టుకొని ఒక ఆరు మైల్లా దూరం వెళ్లి మరో షాపులో సిగరెట్ డబ్బా తీసుకొచ్చారట.  వెళ్లిన వ్యక్తి మళ్లీ సిగరెట్ డబ్బా తీసుకొని రిటర్న్ వచ్చేసరికి సాయంత్రం నాలుగు అయిందట. అప్పటిదాకా ఎన్టీఆర్ ఆ మేకప్ రూమ్ లోనే ఉన్నాడట. చివరికి బాయ్ వచ్చి ఆ సిగరెట్ డబ్బా ఇవ్వగానే ఆయన అది పట్టుకుని మేకప్ రూమ్ నుంచి షూటింగ్ లోకేషన్ కి వచ్చారట.

రావడం రావడమే మీరు సిగరెట్లు కాల్చినందుకు నేను అనడం లేదు, షూటింగ్ స్పాట్ అంటే తప్పకుండా డిస్ప్లే మైంటైన్ చేయాలి. ఎవరి వస్తువులు వారికే తప్పనిసరిగా ఉంచాలి. డిస్ప్లేన్ గా ఉండకపోతే నాకు నచ్చదు అది మీకు అర్థం కావడానికి ఇలా చేశానని ఎన్టీఆర్ చెప్పారట. ఎన్టీఆర్ విషయాన్ని అర్థం చేసుకున్న  ప్రొడ్యూసర్, రైటర్ మరోసారి ఎన్టీఆర్ దగ్గర చిన్న మిస్టేక్ కూడా జరగకుండా సినిమా పూర్తి చేశారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sr-ntr tollywood producer state-express-sigarate gudigantalu

Related Articles