OATS; ఓట్స్ సరిగ్గా ఇలా తింటే వెయిట్ తగ్గుతారని తెలుసా ? 2024-06-25 16:34:00

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఏదో  ఒక సమయంలో మనం అధిక బరువు ( OVER WEIGHT)పెరిగిపోతూ ఉంటాం. సరైన లైఫ్ స్టైల్( LIFE STYLE)   ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్( JUNK FOOD)  తినడం లాంటి కారణాలు, అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగిపోతూ ఉంటాం. ఒక్కసారి పెరిగామా...తగ్గించుకోవడం చాలా కష్టం. తగ్గడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ...అప్పుడు మాత్రం మనం ఏం చెయ్యలేం.  కాని సరైన డైట్ ఫాలో అయితే తగ్గడం సులువే అంటున్నారు. అందులోను ఓట్స్ మరింత బాగా పనిచేస్తుందట. 


ఓట్స్  ఈ మధ్య కనిపెట్టిన ఫుడ్ ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్న తృణధాన్యాల్లో ఓట్స్( OATS)  ఒకటి.  మనకు అవసరం అయిన ప్రోటీన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. బీటా -గ్లూకాన్ ( BETA GLOUCAN) అని పిలువపడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వలనుకునే వారు ..ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. దీని వల్ల పొట్ట ఫుల్ గా ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ శోషణను కూడా తగ్గించడంలో సహాయం చేస్తాయి.  ప్రేగు క్యాన్సర్లు రాకుండా చేస్తుంది.


ఓట్స్ ని మనం తీసుకునే విధానాన్ని పట్టి.. అది మంచిదా చెడ్డదా అని చెప్పొచ్చు అని నిపుణులు అంటున్నారు.  ఇరు ఇన్ స్టాంట్ ఓట్స్ తినకూడదు. దీనిలో   గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు.. పండ్లను కూడా కలుపుతాం. రెండింటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి.. బరువు పెరగడానికీ, అదేవిధంగా షుగర్ క్రాష్ కి కారణం అవుతుంది. బరువు తగ్గాలనుకుంటే ఓట్స్ ఎప్పుడు జావలాగా తీసుకుంటేనే బరువు ఫాస్ట్ గా తగ్గుతారు.