హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో స్థానికులు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వింత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో మహిళలరు ఎవరు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరట
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత్ లో వేల సాంప్రదాయాలు ..మరెన్నో ఆచారాలు మతాలు , కులాలు ప్రతి దానికి ఓ విభిన్న ప్రత్యేకత. అయితే అందరు ఒకటే ఆచారాన్ని కలిగి ఉండాలని ..ఆ ఆచారాన్ని నమ్మాలని రూల్ లేదు. జస్ట్ ఒకరి మతానికి మరొకరు ..ఒకరి ఆచారాలకు మరొకరు రెస్పెక్ట్ చేసుకుంటే చాలు. హ్యాపీ గా బతికేయొచ్చు. అయితే కొన్ని ప్రాంతాలకు తగ్గట్టు..అక్కడ ప్రజలు చాలా ముఖ్యమైన విషయాలను చాలా విచిత్రంగా గడుపుతారు. అలాగే ఓ జాతి వారు తమ పెళ్లిని వింత ఆచారాలతో జరుపుకుంటారు.
హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో స్థానికులు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వింత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో మహిళలరు ఎవరు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరట. హిమాచల్ ప్రదేశ్ లో మణికర్ణ అనే లోయలోని పిని అనే గ్రామంలో మహిళలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతారు.
ఈ సంప్రదాయాన్ని ఆచరించే ఐదు రోజులు పిని గ్రామానికి బయట వ్యక్తులు ఎవరూ రారట. అలాగే మహిళలు కూడా బయటకు వెళ్లకుండా.. ఇంటిలోనే ఒంటిమీద నూలు పోగు లేకుండా.. ఇంట్లో అమ్మవారికి పూజలు జరిపిస్తారు. ఈ ఐదురోజులు ..బయటవాళ్లు కాదు కదా...ఇంట్లో భర్త కూడా కనపించకుండా ఓ గదిలో బట్టల్లేకుండా ఉండి పూజలు జరుపుతారు. ఆ ఐదు రోజుల పాటు పురుషులు మద్యం తాగకూడదు, నాన్ వెజ్ తినకూడదు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు, కనీసం నవ్వుకోకూడదట. ఇలా ఎందుకుంటారంటే ..భార్యభర్తలు శారీరక అవసరాలు దాటి మన బంధాన్ని నిలబెట్టుకోవాలనే అర్ధం ఈ ఆచారానికి మూలం.
అంతేకాదు ఒకప్పుడు ఓ రాక్షసుడు అందంగా బట్టలు వేసుకున్న వారిని ఎత్తుకుపోయేవాడంట దీంతో ఆ ఊర్లో ఆడవారంతా అమ్మవారితో మొరపెట్టుకుంటే బట్టల్లేకుండా కుంకుమతో ఒళ్లంతా కప్పుకొని పూజ జరిపించమని కోరిందట. అందుకే ఆడవారికి పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఐదురోజులు బట్టల్లేకుండా ఓ గదిలో అమ్మవారిని పూజిస్తారు.