రాజకీయ నాయకులు తప్పులు చేస్తే నరకంలో ఈ శిక్షలు వేస్తారట.?

భారతదేశంలో ఎన్నో శాస్త్రాలను  నమ్ముతూ ఉంటారు.  తప్పు చేయాలంటే కూడా భయపడి పోతారు.  ఎందుకంటే భూమిపై బ్రతికున్నప్పుడు తప్పులు చేస్తే మరణించిన తర్వాత  నరకంలో అనేక శిక్షలు


Published Oct 05, 2024 08:27:08 AM
postImages/2024-10-05/1728097028_YAMALOKAM.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారతదేశంలో ఎన్నో శాస్త్రాలను  నమ్ముతూ ఉంటారు.  తప్పు చేయాలంటే కూడా భయపడి పోతారు.  ఎందుకంటే భూమిపై బ్రతికున్నప్పుడు తప్పులు చేస్తే మరణించిన తర్వాత  నరకంలో అనేక శిక్షలు ఉంటాయని నమ్ముతారు. అందుకే బ్రతికి ఉన్న సమయంలో తప్పులు చేయడానికి భయపడిపోతూ ఉంటారు. చాలా ఎక్కువ తప్పులు చేసిన వారికి  రకరకాల పేర్లతో శిక్షలు ఉంటాయి.

మనం విన్న పేర్లు అందకూపం, కుంభీపాకం అయితే ఈ పేర్లను మనం అపరిచితుడు సినిమాలో విన్నాం. మరణించిన తర్వాత వారి యొక్క కర్మలకు అనుగుణంగా స్వర్గానికి వెళ్తారని నరకంలో శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయని మన పురాణ గాధలు చెబుతున్నాయి. ఆ శిక్షలు ఎన్ని రకాలో చూద్దాం.

 అందత మిశ్రా:
 ఈ శిక్షలో దోషులను అంధులుగా మార్చుతారు.  ఈ శిక్షలు అనుభవించే వాళ్లలో  ఎక్కువగా వేరొకరి ఆస్తులను అక్రమంగా లాగేసి ఆనంద జీవితం పొందిన వారికి వేస్తారట. 

 తమిస్ర:
 ఇది పూర్తిగా చీకటిలో ఉంచే శిక్ష.  ఇందులోకి ఇతరుల యొక్క కష్టార్జితం మీద బతికి వారి యొక్క ఆస్తులను ఇతర డబ్బులను దోచుకుని తినేవారికి వేస్తారు. వాళ్ళందరిని తాళ్లతో బంధించి కొడుతూ ఉంటారు.

రౌరావ:
 ఇతరుల మోసం చేసి అన్ని లాక్కున్న వారికి ఇలాంటి శిక్షలు వేస్తారు.  ఈ శిక్షలో ఎక్కువగా పాములు చుట్టూ చేరి శరీరం అణువణువున కాటు వేస్తాయి. ఇలా నిరంతరం హింసలు పెడుతూ, మోసం చేసిన బాధితులు ఎలా బాధపడ్డారు అంతకంటే ఎక్కువ వీరిని బాధపడతారట.

 మహారౌరవ:
 ఈ శిక్షలో తిండిపెట్టి చంపుతారట.  ఆ తిండి కూడా మీకు  నరకరాజ్యంలోని క్రవ్యాదా అని  పిలిచే రూరు జీవుల మాంసాన్ని తినిపిస్తూ హింసిస్తారట. 

 కుంభీపాక :
అయితే ఈ శిక్షణ మనం చాలా సినిమాల్లో చూసాం. అరక లోకంలో సరసల కాగే నూనెలో వేసి వండుతారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా జంతువులను ఎక్కువగా చంపుతూ ఆనందం పొందే వారికి ఈ శిక్ష వేస్తారట.

 శిఖరముక:
ఇది రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా వేసే శిక్ష. రాజకీయ నాయకులు అధికారంలోకి రాక ముందు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తారు. పాలనను దుర్వినియోగం చేసే రాజకీయ నాయకులు మరణించిన తర్వాత ఈ శిక్ష వేస్తారట. శిక్షలో వారిని దారుణంగా శిక్షిస్తారట. కొరడాలతో కొడుతూ, సూదులతో పొడుస్తారట. 

 అందకుపం:
 కొంతమంది ఎంత డబ్బు ఉన్నా కానీ ఇతరులకు అస్సలు సాయం చేయరు. వ్యక్తి కళ్ళ ముందు ఆహారం కోసం విలవిల లాడి, చచ్చిపోయిన కానీ వీరు కనీసం ఆహారం కూడా అందించలేని పరిస్థితిలో ఉంటారు. అలా డబ్బు ఉండి ఇతరులకు సాయం చేయని వ్యక్తులకు ఈ శిక్ష వేస్తారు. ఇందులో కీటకాలు,  జంతువులు వీరిని కాటేస్తూ హింసిస్తూ ఉంటాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu yamalokam kumbipakam shikaramuka andakupam

Related Articles