protein : ప్రోటీన్ పౌడర్ అమ్మకాలపై FSSI కొత్త నిబంధనలు

శరీరానికి ప్రొటీన్ ( protein) చాలా అవసరం ...ముఖ్యంగా జిమ్ కి వెళ్లి కష్టపడుతుంటారు. చాలా మంది ప్రొటీన్ కు సప్లమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ సప్లిమెంట్స్ వినియోగం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయని.. కల్తీ ప్రోటీన్​ను సప్లిమెంట్స్​గా అమ్మేస్తున్నారని (fssai)FSSAI గుర్తించింది. దీని వల్ల టీనేజ్ , మిడిల్ ఏజ్ వారి కిడ్నీలు పాడవడంతో పాటు...గుండె సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.


Published Jul 02, 2024 05:32:00 PM
postImages/2024-07-02/1719921781_HarmfulEffectsOfConsumingFakeProteinPowder800x4205f4e38ef9d80f.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శరీరానికి ప్రొటీన్ ( protein) చాలా అవసరం ...ముఖ్యంగా జిమ్ కి వెళ్లి కష్టపడుతుంటారు. చాలా మంది ప్రొటీన్ కు సప్లమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ సప్లిమెంట్స్ వినియోగం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయని.. కల్తీ ప్రోటీన్​ను సప్లిమెంట్స్​గా అమ్మేస్తున్నారని (fssai)FSSAI గుర్తించింది. దీని వల్ల టీనేజ్ , మిడిల్ ఏజ్ వారి కిడ్నీలు పాడవడంతో పాటు...గుండె సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.


ప్రస్తుతం మార్కెట్లలో అమ్ముతున్న ప్రోటీన్ సప్లిమెంట్స్​లో పాదరసం, లెడ్ వంటి భారీ లోహాలు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. రోజు ప్రొటీన్ పౌడర్ ను వాడే వారు..శరీరంలో పాదరసం , లెడ్ లాంటివి పేరుకుపోతాయి. ఇవి శరీరాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటున్నట్లు గుర్తించారు. ఇవి శరీరంలో చేరితే వాటి ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇవి అలెర్జీ సమస్యలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. వీటివల్ల కడుపులో ఇబ్బందులు, వాంతులు, డయేరియా, అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది. అంతేకాదు...ఇఫ్పుడు ఎంత ఫిట్ గా ఉంటారో ...తర్వాతర్వాత అన్ని ఎక్కువ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు.
ఈ సమస్యను తగ్గించేందుకు FSSAI కొత్త నిబంధనలతో ఈ ప్రాబ్లమ్​ను పరిష్కరించాలని చూస్తుంది. లేబుల్స్( labels)​పై ఉన్న పదార్థాలు.. అంతే మొత్తంలో వేయట్లేదని స్టడీలో గుర్తించారు. అవి కూడా తప్పుగా రాస్తున్నారని అధికారులు చెప్పారు. అసలు లేబుల్స్ మీద రాసినట్లు ప్రొటీన్ పౌడర్స్ లో ఉండడం లేదని తెలిపారు.


ఈ నిబంధనలు తయారీదారులు, వినియోగదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు చెప్తున్నారు. మెరుగైన టెస్ట్, క్వాలిటీ టెస్ట్( quality check)  చేయడం ద్వారా తయారీదారులకు ఖర్చులు పెరుగుతాయి. క్వాలిటీ కలిగిన మంచి ప్రోటీన్ వినియోగదారులకు కూడా మేలు చేస్తుందని తెలిపారు. దీనివల్ల నకిలీ, నాసిరకం ఉత్పత్తులు తగ్గుతాయి. ఇవి వినియోగదారులకు మేలు చేస్తాయి

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health life-style fitness

Related Articles