RAINY SEASON: జ్వరాల కాలం.. జాగ్రత్తలు అవసరం 2024-06-25 18:52:14

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వర్షాకాలం ( RAINY SEASON) స్టార్ట్ అవుతుంది. ఓ వైపు ఎండలు మరో వైపు చిన్న చిరుజల్లులు...వేడిగా ఉందనో తడిచి ముద్దయితే ...జ్వరాలు( FEVER) , జలుబులు( COLD)  తప్పవు. మన పెద్దలు కూడా చెబుతుండేవారు...తొలి జల్లులకు తడవరాదని...వర్షం నీరు చెత్తను, దుమ్ముని , ధూళిని తీసుకువస్తుందట,.
ఇప్పటికే రాష్ట్రంలోని( STATE)  పలు ప్రాంతాల్లో ఎక్కువమంది దగ్గు, జలుబు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు( VOMTING) , విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు( LUNGS PROBLEM) , తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి కూడా సీజనల్‌ ( seasonal problems) వ్యాధులుగానే చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో ఫాస్ట్ గా ఫుడ్ అరగదు...చల్లగా ఉండడంతో నీరు ఎక్కువగా తీసుకోరు దీని కారణంగా డీ హైడ్రేషన్ , యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటి ఎక్కువ  ఇబ్బంది పెడతాయి.


 జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి( head ache) , ఒళ్లునొప్పులు( body pains)  కూడా ఉంటాయి. ఇంకొందరు దద్దుర్లు( rashes) , దురదలతో( itching)  కూడా ఇబ్బంది పడుతుంటారు. విష జ్వరాలతోపాటుగా మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా ( chicken gunya) వంటి వ్యాపిస్తుంటాయి. అంతేకాదు ఈ వర్షాకాలం ...వేడి వేడిగా ఉన్నాయంటు రోడ్డు ప్రక్కల చిరు తిండ్లు తినకండి. దాని వల్ల మీకు మరిన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయని గుర్తుంచుకొండి.


జ్వరం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలి. శరీరం డిహైడ్రేషన్‌కు( de hydration)  గురి కాకుండా సరైన మోతాదులో నీటిని తాగాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. జాగ్రత్తలు తీసుకుంటే ...త్వరగా కోలుకుంటారు . జాగ్రత్తగా ఉండాలి మరి.