కాపీ చేసామంటున్న ప్రతి సారి మేం ఒరిజినల్ కంటే బాగా తీసాం. దీని వల్ల ఎవరికి నష్టం ఉండదు. నా సినిమాకు ప్లస్ అయ్యేవి మాత్రమే నేను తీసుకుంటాను.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజమౌళి విషయానికి వస్తే తన సినిమాల్లోని కొన్ని షాట్స్ హాలివుడ్ సినిమాల నుంచి చాలా భాషా చిత్రాల నుంచి కాపీ చేస్తారని అంటుంటారు. ఆ విషయం ఆయనే ఒప్పుకున్నాడు. ‘చిన్నతనం నుంచీ మనపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంటూనే ఉంటుంది. నా వరకు నేను మన సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు ఉండవు అని ఆలోచిస్తూ ఉండేవాడిని.
‘సఖి’ చిత్రంలో ఒక యాక్సిడెంట్ సీన్ తర్వాత హీరో, హీరోయిన్ ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళే సీన్ యాజిటీజ్‌గా ఒక హాలీవుడ్ సినిమాలోనిది. మనవాళ్లు చాలా సినిమా పాటలు కాపీ కొట్టారు. అయితే అవన్నీ డవలప్డ్ వెర్షన్. కాపీ చేసామంటున్న ప్రతి సారి మేం ఒరిజినల్ కంటే బాగా తీసాం. దీని వల్ల ఎవరికి నష్టం ఉండదు. నా సినిమాకు ప్లస్ అయ్యేవి మాత్రమే నేను తీసుకుంటాను.
అదే నేను ఓ తమిళ్ సినిమా నుంచో, మలయాళ సినిమా నుంచో కాపీ చేస్తే అది ఆ రైటర్‌కి, డైరెక్టర్‌కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొందడం తప్పు అని నేను భావించడం లేదు.ఆ టైమ్‌లోనే ‘శాంతినివాసం’ సీరియల్ చేసే అవకాశం వచ్చింది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సీరియల్ చేశాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్‌లో పరమచెత్త ప్రాజెక్ట్ అదే. రేటింగ్ బాగా వచ్చింది ..ఎలా వచ్చిందో నాకే తెలీదంటు చెప్పుకొచ్చారు రాజమౌళి.