రతన్ టాటా పార్సీ మతానికి చెందిన వ్యక్తి. పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రతన్ టాటా ఇక లేరు...ఈ వార్త కోట్ల మందిని కలిచి వేస్తుంది. బిగ్గెస్ట్ బిజినెస్ టైకూన్లలో ఒకరైన రతన్ టాటా దేశానికి ఓ గొప్ప మణి మకుటం. తాను సంపాదించిన దానిలో 65 శాతం ప్రజల కోసమే వాడారు. ఈ దేశం తనకు ఏం చేసిందని కాకుండా దేశానికి తన వల్ల ఎంత సేవ చెయ్యగలడో అంత సేవ చేశారు. టాటా గ్రూప్ విజయాల్లో కీలక భూమిక పోషించారు.
ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి చేశారు. రతన్ టాటా పార్సీ మతానికి చెందిన వ్యక్తి. పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. కానీ రతన్ టాటా అంత్యక్రియలను సాధారణంగా శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది.
మొదట ఆస్పత్రి నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడ సందర్శనార్ధం రతన్ టాటా పార్ధివదేహాన్ని 3.30 గంటల వరకు ఉంచారు. ప్రభుత్వ లంఛనాలతో వర్లి శ్మశాన వాటిలో రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది.
అయితే పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియలు ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్లు సాధారణంగా నిర్వహించే అంత్యక్రియల పద్ధతులను పాటించరు. పార్సీలు మృతదేహాలను కాల్చడం , పూడ్చడం లాంటివి చెయ్యరు. మానవ శరీరాన్ని భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తారు. అలాంటి అధ్భుతమైన వరాన్ని కాల్చడం , పూడ్చడం చెయ్యరు. మృతదేహాలను రాబందులు, పక్షులు, జంతువులు ఉన్న దగ్గర గాలికి వదిలేస్తారు. ఇందుకోసం టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు.ఈ విధానాన్ని ధమ్కా అని అంటారు. భగవంతుడు ఇచ్చిన దేహాం ఎవరికైనా ఉపయోగపడాలి అని వారి నమ్మకం. కాని ఇప్పుడు పార్సీలు ఈ పధ్ధతిని వాడకలో లేదు.
ముఖ్యంగా సిటీల్లో అసలు రాబందులు కనిపించడమే లేదు. అందుకే పార్సీల్లో చాలా మంది టవర్ ఆఫ్ సైలెన్స్ విధానాన్ని పాటించడం మానేశారు. 2022లో పార్సీ మతానికి చెందిన మరో ప్రముఖుడైన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా.. వర్లీ శ్మశాన వాటికలోనే నిర్వహించారు. అంత గొప్పగా బ్రతికిన వ్యక్తి శరీరాన్ని అలా రాబందులు పీక్కుతినేలా ఉంచడం అంతా ఆమోధ్యయోగ్యం కాదని అంటున్నారు. అందుకే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.