RRRసినిమా రిలీజ్ కి ముందు మేకింగ్ , ప్రీ ప్రొడక్షన్ , రిలీజ్ తర్వాత సినిమా సాధించిన విజయాలతో ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : RRR సినిమా క్రియేట్ చేసిన బజ్ అందరికి తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా సెన్సేషన్. నిజానికి స్టార్స్ ని కాస్తా...పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ ను తయారుచేశారు. అయితే ఇంటర్నేషనల్ వైడ్ ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చింది కూడా RRR. ఏకంగా ఈ సినిమాకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. బోలెడన్ని ఇంటర్నేషనల్ అవార్డులు, కలెక్షన్స్ రికార్డులు సాధించిన ఈ సినిమా రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్.
రాజమౌళి పై ఇప్పటికే డాక్యుమెంటరీ రాగా ఇఫ్పుడు RRR మేకింప్ పై డాక్యుమెంటరీ రాబోతుంది. RRRసినిమా రిలీజ్ కి ముందు మేకింగ్ , ప్రీ ప్రొడక్షన్ , రిలీజ్ తర్వాత సినిమా సాధించిన విజయాలతో ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ డెసంబర్ లోనే రిలీజ్ కానున్నట్లు RRR టీమ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన RRR టైటిల్ తో రాజమౌళి ఉన్న ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.