వర్షాలు ( RAINS) మొదలయ్యాయంటే చాలు ...ఎండాకాలం అంతా తాగిన ..కూల్ డ్రింకులు( COOL DRINKS) , ఐస్ క్రీములు( ICE CREAM) ..దగ్గులు ..కఫాలు...శ్వాస వ్యవస్థలో శ్లేష్మ పొర ద్వారా ఉత్పత్తి అయిన మందపాటి పధార్ధంగా బయటకు వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్లు, అలెర్టీల వల్ల దీని ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా దగ్గు( CAUGH) , శ్వాసలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వర్షాలు ( RAINS) మొదలయ్యాయంటే చాలు ...ఎండాకాలం అంతా తాగిన ..కూల్ డ్రింకులు( COOL DRINKS) , ఐస్ క్రీములు( ICE CREAM) ..దగ్గులు ..కఫాలు...శ్వాస వ్యవస్థలో శ్లేష్మ పొర ద్వారా ఉత్పత్తి అయిన మందపాటి పధార్ధంగా బయటకు వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్లు, అలెర్టీల వల్ల దీని ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా దగ్గు( CAUGH) , శ్వాసలో ఇబ్బంది, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తాయి.
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల నిరోధక వ్యవస్థ బలహీన పడడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, కఫం ఏర్పడడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దగ్గు, కఫం చేరినట్టు అనిపించగానే ముందుగా పాలు, పాల ఉత్పత్తులను మానెయ్యాలి. 10-12 నల్ల మిరియాలు తీసుకుని వాటిని దంచుకోవాలి. మెత్తని పొడి చెయ్యకూడదు. బరకగా దంచుకోవాలి. వీటిని రాత్రంతా తేనెలో( HONEY) నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తేనెమిరియాల మిశ్రమాన్ని 8-12 గంటల తర్వాత నమిలి మింగాలి. ఇది కఫాన్ని తొలగిస్తుంది. మీకు గొంతు నుంచి ...పొట్టలో చేరే వరకు ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా..తగ్గిస్తుంది.
అస్తమా( asthama) , సైనసైటిస్ వంటి సమస్యలతో బాధ పడేవారు పసుపును మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల కఫం తగ్గుతుంది. పసుపు, వేప, కర్పూరవల్లి వంటి రకరకాల కాంబినేషన్లకు పసుపును బేస్ గా తీసుకొండి. దీని వల్ల శరీరం వేడిగా ఉండడమే కాదు...చాలా వరకు ఇమ్యూనిటీని పెంచుతుంది.
నల్ల మిరియాల్లో BLACK PEPPER0 ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక కఫాన్ని తగ్గించడంలో మంచి పాత్ర పోషిస్తాయి. మిరియాల్లెపి పెపరీన్ వంటి సమ్మేళనాలు పలుచని శ్లేష్మాన్ని కూడా శ్వాస వ్యవస్థ నుంచి తొలగించగలుగుతాయి.
ముఖ్యంగా కపాలభాతి, భస్త్రిక వంటి ప్రాణాయామ పద్ధతుల్లో లోతుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల అదనపు శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. మొత్తం శ్వసకోశ ఆరోగ్యానికి ప్రాణాయామం ఎంతో ఉపయోగకరం.