Gold Rate : ఈ రోజు బంగారం ధర ..గ్రాము మీద ఎంత తగ్గిందంటే !

ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,67,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,676గా ఉంది.


Published Sep 11, 2024 07:01:00 AM
postImages/2024-09-11/1726018354_c5b77cb241d018547e79cc3b2215aec2.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధరలు ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,760కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,770కాగా ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి.  ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,67,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,676గా ఉంది.


నిజానికి నిన్న కూడా బంగారం 10 రూపాయిలు తగ్గుతూనే వచ్చింది. ఈ రోజు తులం మీద మరో 100 రూపాయిలు తగ్గింది.  24 క్యారట్ల బంగారం ధర సైతం రూ.10 దిగొచ్చి 72,830 గా మార్కెట్ నడుస్తుంది. అదే సమయంలో 100 గ్రాముల  ప్యూర్ పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,28,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,283గా ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,760 పలుకుతోంది


* ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,910గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,980గా మార్కెట్ ధర నడుస్తుంది.


* కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,760 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​..       72,830గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.


*చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,760గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,830గా ఉంది. అయితే సౌత్ లో మరింత పెరిగే అవకాశముందంటున్నారు నిపుణులు .


* బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,760గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,830గాను ఉంది.


* హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,760గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,830గా నమోదైంది. 


* విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో ఇంచుమించుగా ఇవే ధరలు నడుస్తున్నాయి. అయితే షాప్ మెయింటైనెన్స్  తో పాటు  జీఎస్టీ అంతా కలిపి మరికొంత డబ్బును జోడించి మార్కెట్ సెల్లింగ్ చేస్తారు.


దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,610గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,100గా కొనసాగుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో వెండిధర పెరుగుతూనే వస్తుంది. అదే కలకత్తా లాంటి నగరాల్లో కేజీ వెండి 86100 మాత్రమే, బెంగుళూరు లో 84,100 మాత్రమే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold-rates silver-rate september

Related Articles