Spain: ఇక నుంచి అలాంటి సినిమాలు పెద్దవాళ్లకి మాత్రమే ..?

సోషల్ మీడియా కాని టీవీ కాని ఓపెన్ చెయ్యాలంటే భయేస్తుంటుంది. అసలు ఏ సీన్లు చూస్తామో...పిల్లలతో ఏ చూడకూడని సినిమాలు చూస్తామో అని భయపడుతుంటారు. ఇప్పుడు బయట పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకే పెద్దవాళ్లకు మాత్రమే ఉపయోగపడేలా..వారు మాత్రం చూసేలా స్పెయిన్ లో సరికొత్త ఆలోచన చేసింది.


Published Jul 07, 2024 08:12:00 PM
postImages/2024-07-07/1720363673_5b82577510f345ae88a9affbdf7d3b31.jpg

న్యూూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా కాని టీవీ కాని ఓపెన్ చెయ్యాలంటే భయేస్తుంటుంది. అసలు ఏ సీన్లు చూస్తామో...పిల్లలతో ఏ చూడకూడని సినిమాలు చూస్తామో అని భయపడుతుంటారు. ఇప్పుడు బయట పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకే పెద్దవాళ్లకు మాత్రమే ఉపయోగపడేలా..వారు మాత్రం చూసేలా స్పెయిన్ లో సరికొత్త ఆలోచన చేసింది.


సెల్ ఫోన్లు ...వచ్చాక పిల్లలు ఏం ఓపెన్ చేస్తున్నారో తెలీడం లేదు. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా...అయినా మైనర్లు పోర్న్ సైట్లు చూడడం లాంటి నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. పోర్న్ సినిమాలు కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త మొబైల్ యాప్ ను తయారుచేసింది. పోర్న్ పాస్ పోర్ట్ గా వ్యవహరిస్తున్న ఈ యాప్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. మైనర్లకు ఈ పోర్న్ చూడకుండా చేయడమే..ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం.


ఈ యాప్ లో లాగిన్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ మీరు పర్సనల్ ఐడీ డీటైల్స్ తో లాగిన్ అవ్వాల్సిందే . ఆ ఐడీలోని వయసు ఆధారంగా యూజర్ ఏజ్ కన్ఫర్మ్ చేసుకుని, పద్దెనిమిదేళ్లు పైబడిన వారికే యాక్సెస్ కల్పిస్తుంది. ఒకసారి లాగిన్ అయ్యాక యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీకి నెలనెలా 30 పోర్న్ క్రెడిట్స్ జమ అవుతాయి. 


ఆన్ లైన్ లో పోర్న్ చూసేందుకు ఈ క్రెడిట్స్ ఉపయోగపడతాయి. ఈ క్రెడిట్స్ లేకుండా పోర్న్ చూడడం (ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్లలో సాధ్యం కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...పోర్న్ కు మైనర్లు బానిసలవుతున్నారు. దీనిని స్పెయిన్ తీసుకువస్తున్న యాప్ కంట్రోల్ చెయ్యగలదని నమ్ముతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style

Related Articles