శ్రీనివాసరాజు నుంచి లంచం మొత్తాన్ని రికవరీ చేయగా, డబ్బును ఉంచిన అతని కారు డ్యాష్‌బోర్డ్‌పై నిర్వహించిన రసాయన పరీక్షలో లంచం ఉన్నట్లు నిర్దారించామని ఏసీబీ అధికారులు తేలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి తిమింగిలం పట్టుబడింది. కో-ఆపరేట్ డిపార్ట్మెంట్‌లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నకున్నారు. ఆఫీసుకు వచ్చిన వారి దగ్గర నుండి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా శ్రీనివాసరాజుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
శ్రీనివాసరాజు నుంచి లంచం మొత్తాన్ని రికవరీ చేయగా, డబ్బును ఉంచిన అతని కారు డ్యాష్‌బోర్డ్‌పై నిర్వహించిన రసాయన పరీక్షలో లంచం ఉన్నట్లు నిర్దారించామని ఏసీబీ అధికారులు తేలిపారు. శ్రీనివాసరాజును అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పరిచామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.