HEALTH: తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

కొంత మంది షార్ప్ గా ఉంటారు. చెప్పిన వెంటనే అది అర్ధం కాదు..మరికొంతమంది సిట్యువేషన్ కు తగినట్లు అల్లుకుపోతుంటారు. అవే తెలివితేటలు...సమయస్పూర్తి. కొంతమందికి ఈ తెలివి అనుకున్న టైంకి పనికిరాదు. ఈ తెలివితేటలు ఎక్కువగా ఉండడానికి కొన్ని అలవాట్లే కారణం. ఈ అలవాట్లు మీకు చాలా హెల్ప్ అవుతాయి చూసుకొండి. 


Published Jul 08, 2024 02:51:00 PM
postImages/2024-07-08/1720430517_meditationformemorypower.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంత మంది షార్ప్ గా ఉంటారు. చెప్పిన వెంటనే అది అర్ధం కాదు..మరికొంతమంది సిట్యువేషన్ కు తగినట్లు అల్లుకుపోతుంటారు. అవే తెలివితేటలు...సమయస్పూర్తి. కొంతమందికి ఈ తెలివి అనుకున్న టైంకి పనికిరాదు. ఈ తెలివితేటలు ఎక్కువగా ఉండడానికి కొన్ని అలవాట్లే కారణం. ఈ అలవాట్లు మీకు చాలా హెల్ప్ అవుతాయి చూసుకొండి. 


 చదివే అలవాట్లు: గొప్ప గొప్ప వాళ్లకు చదివే అటవాటు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ప్రతి రోజూ వార్తాపత్రిక లేదా మీకు ఇష్టమైన పుస్తకమైనా చదవండి. మీరు ఇంకా ఇంకా షార్ప్ అవుతారు.
నిద్రకు ప్రాధాన్యత : మీ మెదడుకు నిద్ర మంచి బూస్ట్ . ఇఫుడు సోషల్ మీడియాలో చెబుతున్నట్లు  ..నాలుగు గంటల నిద్ర చాలు..లాంటివి కాకుండా కంటి నిండా నిద్రపొండి. 


ఆసక్తి:  కొంతమంది కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నిజానికి కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, కుతూహలం మిమ్మల్ని ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ప్రశ్నలు అడగడం,  కొత్త విషయాలు నేర్చుకోవడం మీ తెలివితేటలను పెంచుతుంది. మీరు అడిగే ప్రతి ప్రశ్న మీ మెదడు పనితీరు పెంచుతుంది.
సోషల్ ఇంటరాక్షన్:  నేను ఇంట్రోవర్ట్ ..ఎవరితో మాట్లాడను...పది మందిలో కలవను లాంటివి పెట్టుకోకండి. సోషల్ ఇంట్రాక్షన్ ఓ అలవాటు...మీరు జనాలతో మాట్లాడుతూ ఉంటే అదే అలవాటవుతుంది. నా వల్ల కాదని అనుకోకండి. అంతే కాదు ..


శరీరం బలంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేస్తాం కదా...మెదడు కి కూడా ఓ వ్యాయామం కూడా ఉండాలి. ఇది చదరంగం ఆడటం కావొచ్చు, సుడోకు ఆడటం లేదా కొత్త భాషను నేర్చుకోవడం కావొచ్చు.మీరు తినే ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లు వంటి మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలున్న ఆహారాన్ని చేర్చండి. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students health-benifits

Related Articles