ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిశాయి. దీంతో స్కూళ్లకు తరచూ సెలవులు వస్తున్నాయి. వర్షాలు ఎక్కువ కురిస్తే చాలు ప్రభుత్వాలు సెలవులు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇదే తరుణంలో ఇలా తరచూ
న్యూస్ లైన్ డెస్క్: ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిశాయి. దీంతో స్కూళ్లకు తరచూ సెలవులు వస్తున్నాయి. వర్షాలు ఎక్కువ కురిస్తే చాలు ప్రభుత్వాలు సెలవులు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇదే తరుణంలో ఇలా తరచూ సెలవులు వస్తే విద్యార్థులు చదువు దెబ్బతినే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తల్లిదండ్రులకు మంచి వార్త కానీ చదువుకునే విద్యార్థులకు మాత్రం షాకే అని చెప్పవచ్చు.
సెప్టెంబర్ 14వ తేదీన రెండవ శనివారం రాబోతోంది. ఇది సెలవుదినంగా ప్రకటించాలి. ఇదే తరుణంలో 15వ తేదీన ఆదివారం. 16న మిలాద్ ఉన్ నబీ ఉంది కాబట్టి సెలవు ఇస్తారు. 17న వినాయక నిమర్జనం. ఈ విధంగా నాలుగు రోజులపాటు వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేయనుంది. 14, 15 తేదీల్లో సెలవులు..
16న పండగ ఉంది కాబట్టి నెలవంక దర్శనాన్ని బట్టి పండుగను 16 లేదా 17వ తేదీన జరుపుకుంటారు. కాబట్టి ప్రభుత్వం 16వ తేదీన సెలవు రద్దు చేసింది. ఆ సెలవును 17న ఇస్తున్నట్టు తెలియజేసింది. ఈ విషయం తెలియడంతో కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు నాలుగు రోజులు వరుసగా సెలవులు రావడంతో ఏదైనా టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నవారు మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది.