Horse: గుర్రం కాలు విరిగితే వాటిని చంపేస్తారని తెలుసా ? 2024-06-27 07:07:04

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గుర్రం( horse)  వేగానికి మారుపేరు..వేగమే దాని ప్రత్యేకత. రేసు గుర్రాల గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. వీటికి ఎంత పవర్ ఉంటుందంటే ...వెహికల్ పవర్ ( vehical power)  ను హార్స్ పవర్( horse power) తో ఇందుకే పోలుస్తారు. కాని చాలా సార్లు రేసింగ్స్ లో కాని ...గుర్రాలు పెంపకంలో కాని గుర్రాల కాళ్లు విరిగిపోతుంటాయి. అది సాధారణమే. కాని కాలు కాని విరిగితే ఇక గుర్రం పనికిరాదు. అందుకే వాటిని చంపేస్తారు.


 ఇది విన్నవారికి మాత్రం మరీ దారుణమా అనుకుంటారు. కొన్ని సార్లు ..మనం కఠినంగా ఉండడం కూడా వాటికి సాయం చేయడమే అవుతుంది. గుర్రం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ...దాని బరువు( weight)  దాదాపు 100 నుంచి పై మాటే...కాళ్లు మాత్రం అంత స్ట్రాంగ్ గా ఉండదు. దీని వల్ల అంత సున్నితమైన కాళ్లు విరిగితే గుర్రం తన బరువును మోయలేక ...మిగిలిన మూడు కాళ్లు కూడా బోన్స్ ఫ్రక్చర్ అవుతాయి.

ఇందులోను గుర్రం వయసు కూడా చాలా ఇంపార్టెంట్ ..చిన్న వయసు గుర్రం అయితే తక్కువ బరువుతో ..ఉంటే సర్జరీ చేయించొచ్చు. కాని ఖర్చు తో కూడుకున్న పని...ఇక వయసు మళ్లిన గుర్రాలు కాళ్లు విరిగితే మాత్రం ఖచ్చితంగా చంపేయడమే మార్గమన్నట్లుంటారు. నిజానికి ఇది మనకి జాలిలేకపోవడం అనుకుంటాం కాని వాటికి మాత్రం ...మెర్సీ కిల్లింగ్ లాగా...వాటికి ఇది చాలా రిలీఫ్.