మానసిక శక్తికి మానసిక అనారోగ్యాలకు సంబంధం లేదు. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా...మీరు పరిస్థితిని హ్యాండిల్ చేసే దాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
.న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మానసిక ఆరోగ్యం ..ఇప్పటి జనరేషణ్ కు దీని గురించి చాలా బాగా తెలుసు. ఒకప్పటి వాళ్లకి తెలిసిందల్లా కష్టపడాలి...రెస్టు తీసుకోవాలి. కాని ఇఫ్పటి వాళ్లకి ...బోలెడు యాతన ...తినాలి..తిరగాలి..పక్కోడిని తొక్కేయాలి. ఇంత కుళ్లు తో నిద్ర ఎలా పడుతుంది. అందుకే నిద్రపోకుండా ఉండడం వల్లే మానసిక రోగులుగా మారుతున్నారు. అసలు మానసిక రోగానికి మందులే లేకుండా ..పాత తరం ఎలా నెట్టుకొచ్చింది. ఈ రోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే .
మానసిక శక్తికి మానసిక అనారోగ్యాలకు సంబంధం లేదు. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా...మీరు పరిస్థితిని హ్యాండిల్ చేసే దాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లల్లో, యువతలో మానసిక సమస్యలు ఉండవనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంటుంది. కానీ ఇది కూడా అపోహే... నిజం కాదు. వయసుతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మానసిక అనారోగ్యాలున్నవారంతా ఒకేరకంగా ప్రవర్తిస్తారని అన్ని రకాల మానసిక అనారోగ్యాలు ఒకటేననే అపోహ కూడా మన సమాజంలో ఉంది. కాని మానసిక సమస్యలున్నవారు ..సాధారణంగా ఉన్నవారి కంటే ఎక్కువ స్పీడ్ గా ఆలోచించగలరు.మానసిక సమస్యలకు మందులు మాత్రమే పరిష్కారమని తప్పనిసరిగా మందులు వాడాలని కొంతమంది అనుకుంటారు. మానసిక ఆరోగ్యానికి మందులు కాదు...మనుషులు కావాలి. మనం పడే బాధను షేర్ చేసుకొని నిన్ను జడ్జ్ చెయ్యని ఓ మనిషి కావాలి. అప్పుడే ఈ మానసిక సమస్యల నుంచి దూరం జరుగుతారు. చుట్టు ఉన్న వారు ఎంత ప్రయత్నించినా..మీకు మీరు ధైర్యం చెప్పుకోకపోతే ఈ డిప్రెషన్ మిమ్మల్ని చంపేస్తుంది.