జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు బయలుదేరే విమానాలు మే 13 మంగళవారం రద్దు చేసినట్లు కంపెనీ తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా అనేక విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులభద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన సంస్థ అడ్వైజరీ లో తెలిపింది. దేశంలో చాలా విమానాశ్రయాలు మే 7,2025 నుంచి మూసేశారు. లేహ్, అమృత్‌సర్ కాకుండా ఏ నగరాలకు విమానాలు రద్దు చేసింది చూద్దాం. జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు బయలుదేరే విమానాలు మే 13 మంగళవారం రద్దు చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఇండిగో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X హ్యాండిల్‌లో ఒక సలహా జారీ చేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా , జమ్మూ, అమృత్ సర్ , చండీగఢ్ , లేహ్ , శ్రీనగర్ , రాజ్ కోట్ లకు వెళ్లే మరియు వెళ్లే విమానాలు మే 13,2025 వరకు రద్దు చేసినట్లు అడ్వైజరీ పేర్కొంది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించవచ్చని మేము అర్ధం చేసుకున్నాము. కానీ దానికి మేము చింతిస్తున్నాం అని కంపెనీ తెలిపింది.